Thaman: తమన్ మ్యూజిక్ కి ఫిదా అయిన ప్రభాస్ డైరెక్టర్…

Thaman: కొత్త సినిమాల మ్యూజిక్ అప్డేట్స్ ను అభిమానులకు తెలుపుతూ సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టివ్ గా  ఉంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్. ఇటీవల విడుదలైన “అఖండ” చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలో కూడా కాసుల వర్షం కురిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ నిలిచిందని చెప్పాలి. “అఖండ” సినిమాకి మ్యూజిక్ సౌండ్ వాల్యూమ్ పెంచితే స్పీకర్స్ పనిచేయవని థియేటర్స్ యాజమానులు విజ్ఞప్తి […]

Written By: Raghava Rao Gara, Updated On : December 14, 2021 9:58 pm
Follow us on

Thaman: కొత్త సినిమాల మ్యూజిక్ అప్డేట్స్ ను అభిమానులకు తెలుపుతూ సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టివ్ గా  ఉంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్. ఇటీవల విడుదలైన “అఖండ” చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలో కూడా కాసుల వర్షం కురిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ నిలిచిందని చెప్పాలి. “అఖండ” సినిమాకి మ్యూజిక్ సౌండ్ వాల్యూమ్ పెంచితే స్పీకర్స్ పనిచేయవని థియేటర్స్ యాజమానులు విజ్ఞప్తి చేసే పరిస్థితి నెలకొల్పేలా  తమన్ మ్యూజిక్ సెన్సెషన్ క్రియేట్ చేసింది.అయితే థమన్ మ్యూజిక్ దరువుకు డైరెక్టర్స్ ఫిదా అవుతున్నారు.తాజాగా తమన్‏తో “రాధేశ్యామ్” చిత్రానికి రీరికార్డింగ్ చేయించేందుకు యూవీ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే వివిధ భాషలలో విడుదలైన “రాధేశ్యామ్”పాటలు ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంటుంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా పిరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో నటిస్తున్న “రాధేశ్యామ్” సినిమాకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లకు మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. హిందీ వెర్షన్‏కు మిథున్, అర్మాన్ మాలిక్, అర్జీత్ సింగ్, మనన్ భరద్వాజ్ పనిచేస్తున్నారు. ఈ పిరియాడిక్ లవ్ స్టోరీని మ్యూజిక్ తో మరింత సెన్సెషన్ క్రియేట్ చేసేందుకు థమన్ ను రంగంలోకి దించుతున్నట్లుగా టాక్. చూడాలి మరి ఈ వార్త లు ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో తెలియాలంటే వచ్చే ఏడాది జనవరి 14 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.