https://oktelugu.com/

Naga Chaitanya: పరోక్షంగా సామ్‌ను ఉద్దేశించి మాట్లాడిన చైతూ … ఏం అన్నారంటే ?

Naga Chaitanya: టాలీవుడ్ ప్రేమ జంట అక్కినేని నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్న ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉన్నారు. ఈ మాజీ దంపతులు విడాకులు తీసుకుని రెండు నెలల పూర్తయినప్పటికీ వీరి మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం తగ్గడం లేదు. అయితే ఈ విడాకుల విషయంలో లో సమంత పై పలు తప్పుడు వార్తలు రాసిన వాటిపై రియాక్ట్ సమంత. వార్తలపై అలానే విడాకులపై చైతు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 14, 2021 / 10:04 PM IST
    Follow us on

    Naga Chaitanya: టాలీవుడ్ ప్రేమ జంట అక్కినేని నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్న ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉన్నారు. ఈ మాజీ దంపతులు విడాకులు తీసుకుని రెండు నెలల పూర్తయినప్పటికీ వీరి మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం తగ్గడం లేదు. అయితే ఈ విడాకుల విషయంలో లో సమంత పై పలు తప్పుడు వార్తలు రాసిన వాటిపై రియాక్ట్ సమంత. వార్తలపై అలానే విడాకులపై చైతు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం తాజాగా నాగచైతన్య గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్‌గా మారింది. అందులో చైతు మాట్లాడిన విషయాలు పరోక్షంగా సామ్‌ను ఉద్దేశించినవే అంటూ నెటిజన్లకు హాట్ టాపిక్ గా చర్చించుకుంటున్నారు.

    అయితే ఈ వీడియోలో ఏ పాత్రలు చేయడానికి మీరు ఇష్టపడరు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు… చైతూ నేను ఏ పాత్ర చేయడానికైనా సిద్దంగా ఉంటా అన్నారు.  కానీ నా ఫ్యామిలీపై పర్సనల్‌గా ఎఫెక్ట్ చూపే పాత్ర ఏదైనా… ఎటువంటి కథ అయినా ఎట్టి పరిస్థితుల్లో చేయను అని నాగచైతన్య చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నాగచైతన్య సమంతను ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్‌గా చేసినవేనని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సమంత కూడా తన ఖాతాలో లైఫ్ కొటేషన్స్ పెడుతూ తన భావాన్ని వ్యక్తపరుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నాగచైతన్య థాంక్స్ , బంగార్రాజు షూటింగ్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు. నాగ్ – కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్ గా ఈ మూవీ రానుంది.  అలాగే ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగచైతన్య సరసన కృతి శెట్టి సందడి చేయనుంది.