Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరో కొనసాగుతున్న నటుడు కూడా తనే కావడం విశేషం…ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. రీసెంట్ గా ‘రాజాసాబ్’ సినిమాతో కొంతవరకు డీలా పడ్డప్పటికి ఆయన స్టాండర్డ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తన మార్కెట్ ను కూడా విపరీతంగా విస్తరించుకున్నాడనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ తో ఒక సినిమా చేస్తే అది సూపర్ సక్సెస్ సాధిస్తే ఈజీగా 2000 కోట్ల మార్క్ ను అందుకోవచ్చనే కాన్సెప్ట్ తోనే దర్శక నిర్మాతలు ఉన్నారు…
గతంలో ప్రభాస్ చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ వచ్చాడు. అయితే ఆయన కొరియోగ్రాఫర్లను ఎక్కువగా ఎంకరేజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా రాఘవ లారెన్స్, ప్రభుదేవా లాంటి వాళ్లతో సినిమాలను చేశాడు.
ఇదే సమయంలో అమ్మ రాజశేఖర్ తో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అది అనుకోని కారణాలవల్ల ఆగిపోయిందట. రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మ రాజశేఖర్ ప్రభాస్ తనతో సినిమా చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చాడని చెప్పాడు. నిజానికి తను ప్రభాస్ ని అపార్థం చేసుకున్నాడని కొంతమంది చెబుతున్నారు.
కారణం ఏంటి అంటే అప్పుడున్న బిజీ వల్ల ప్రభాస్ అతనితో సినిమా చేయలేకపోయాడని ఆ తర్వాత అతను చెప్పిన కథ ప్రభాస్ ఇమేజ్ కి సరిపడా విధంగా లేకపోవడం వల్ల ఆ తర్వాత కూడా అతనికి ఛాన్స్ అయితే ఇవ్వలేదని మరి కొంతమంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటికీ ఇండియాలో ఉన్న చాలా మంది దర్శకులు ప్రభాస్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్లందరికి అవకాశం దొరికే ఛాన్స్ లేదు. ఎవరైతే అతన్ని తన కథతో మెప్పిస్తారో వాళ్లకు మాత్రమే అవకాశాలైతే దక్కుతున్నాయి…
