
Prabhas : ప్రభాస్ కెరీర్ ని ఎవ్వరూ ఊహించని రేంజ్ మలుపు తిప్పిన చిత్రం బాహుబలి.అప్పటి వరకు ఒక మామూలు హీరోగా ఇండస్ట్రీ లో చలామణి అవుతున్న ప్రభాస్ ని పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా నిలబెట్టింది ఈ సినిమా.ఈ చిత్రం తర్వాత ప్రభాస్ ఫ్లాప్ సినిమా, మిగిలిన స్టార్ హీరోల హిట్ సినిమాలతో సమానంగా వసూలు చేసింది.ఇంత స్టార్ స్టేటస్ ఊరికే రాదు,మూడేళ్ళ పాటు ప్రభాస్ ఎంతో కస్టపడి చేస్తే వచ్చింది.
ఇప్పటికీ ఈ చిత్రం వసూళ్లు ఒక్క సూపర్ స్టార్ కూడా ముట్టుకోలేకపొయ్యాడు అంటే, ఈ సినిమా రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.అయితే అలాంటి సెన్సషనల్ సిరీస్ ని కొనసాగించే ఆలోచనలో ఉన్నాడట ఆ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ.ఇటీవలే ప్రభాస్ బాహుబలి నిర్మాతలతో భేటీ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ భేటీ కచ్చితంగా బాహుబలి 3 కోసమే అని ఫ్యాన్స్ అంటున్నారు.
అయితే ఈ బాహుబలి 3 చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తాడా, లేదా వీరే పాపులర్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తాడా అనేది చూడాలి.ఎందుకంటే రాజమౌళి కాల్ షీట్స్ మరో 5 ఏళ్ళు వరకు మహేష్ బాబు తో చెయ్యబొయ్యే సినిమాకే అంకితం.కాబట్టి ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ రాజమౌళి కి అయితే సాధ్యం కాదు, కచ్చితంగా వేరే డైరెక్టర్ తోనే చెయ్యాలి , మరి ప్రభాస్ రాజమౌళి కాకుండా ఇలాంటి ప్రాజెక్ట్ వేరే డైరెక్టర్ తో చేస్తాడా లేదా అనేది చూడాలి.
ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ అనే చిత్రం తో పాటుగా, నాగ అశ్విన్ తో ‘ప్రాజెక్ట్ K’ మరియు మారుతీ తో ‘రాజా డీలక్స్’ వంటి సినిమాలు చేస్తున్నాడు.మరోపక్క ఓం రౌత్ తో చేసిన ‘ఆది పురుష్’ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది.జూన్ 16 వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది.