Prabhas Mahesh Babu Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది నటులు టాప్ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్లాడు. తర్వాత తన కొడుకు అయిన మహేష్ బాబు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం తను టాప్ హీరోగా వెలుగొందడమే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధిస్తే పాన్ వరల్డ్ లో కూడా తన పేరు మారి మ్రోగిపోయేలా చేసుకున్న వాడు అవుతాడు. ఇక ఇప్పటివరకు మహేష్ బాబుకి భారీ విజయాలైతే దక్కాయి.
ఇక మొదటిసారి ఆయన పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి ప్రవేశిస్తూ ఉండడం విశేషం…కృష్ణ మహేష్ బాబు ప్రభాస్ ఇద్దరిని హీరోలుగా పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. నిజానికి కృష్ణ, కృష్ణంరాజు కాంబినేషన్లో ఇంతకుముందు చాలా మల్టీ స్టారర్ సినిమాలైతే వచ్చాయి.
కృష్ణంరాజు తనకు మొదటి నుంచి చాలా మంచి ఫ్రెండ్ కావడంతో ప్రభాస్ కూడా కృష్ణకి పరిచయమైతే ఉంది. దానివల్ల మహేష్ బాబు ప్రభాస్ ఇద్దరు సమకాలీన హీరోలుగా రాణిస్తుండటం చూసిన ఆయన వీళ్ళిద్దరిని పెట్టి ఒక సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకున్నాడు. కానీ అది కార్య రూపం దాల్చలేదు. కారణం ఏంటి అంటే వాళ్లిద్దరి ఇమేజ్ కి తగ్గ కథ అతనికి దొరకలేదట.
చాలామంది రైటర్స్ తో కూర్చొని కథను సిద్ధం చేసే పని పెట్టుకున్నప్పటికి కథ మాత్రం సెట్ అవ్వలేదు. కృష్ణ కథ విషయంలో ఎక్కడా రాజీపడరు. అది క్లారిటీగా ఉన్నప్పుడే దానిని స్క్రీన్ మీదకు తీసుకురావాలని మొదటి నుంచి ఆయన అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ కథ విషయంలో ఆయన చాలావరకు డిసప్పాయింట్ అవ్వడంతో ఆ సినిమాని పక్కన పెట్టారు. లేకపోతే ప్రభాస్, మహేష్ బాబు కాంబినేషన్లో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా వచ్చేది…