spot_img
Homeఅంతర్జాతీయంTrump Iran Sudden Peace: ట్రంప్‌ సడెన్‌ గా ఎందుకు మారాడు.. యుద్ధం ఆపాడు.. అసలేంటి...

Trump Iran Sudden Peace: ట్రంప్‌ సడెన్‌ గా ఎందుకు మారాడు.. యుద్ధం ఆపాడు.. అసలేంటి కారణం?

Trump Iran Sudden Peace: ఇరాన్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం.. కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేస్తాం. హర్మూజ్‌ను స్వాధీనం చేసుకుంటాం. ల్యాండ్‌ ఆర్మీని దించుతున్నాం. ఇరాన్‌ వెంటనే ఒప్పందం చేసుకోవాలి.. లేకుంటే ఇదే ఇరాన్‌కు చివరి రాత్రి అని తీవ్ర స్వరంతో హెచ్చరించిన ట్రంప్‌.. కొన్ని గంటల్లోనే శాంతి మార్గం ఎంచుకున్నారు. దుర్భాషలతో అవతలివారిపై విరుచుకుపడి అసహనం చూపిన ఆయన స్వరం ఎందుకు మార్చుకున్నారు? ఈ మలుపు పశ్చిమాసియా ఘర్షణల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ట్రంప్‌ బెదిరింగ్‌లు ఫలితం ఇచ్చాయా? రెండు వారాల కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుంది?

Also Read: డేవిడ్ మిల్లర్.. అప్పుడు.. ఇప్పుడు.. నష్ట జాతకుడు

బాహ్య ఒత్తిళ్లతో తగ్గిన ట్రంప్‌..
ఘర్షణ పెరగకుండా ఉండాలని అమెరికాను ఒప్పించడానికి పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతోపాటు ఇరాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా గట్టి ప్రయత్నాలు చేసింది. అమెరికాలో డెమోక్రటిక్‌ శాసకులు ట్రంప్‌ హెచ్చరికలను ‘నైతిక ఓటమి‘గా ఖండించారు. పోప్‌ లియో XIV సహా అంతర్జాతీయ నాయకులు ట్రంప్‌ తీరును తప్పుబట్టారు. ఎన్నికల సమయంలో ‘అనవస యుద్ధాల నుంచి అమెరికాను బయటపడేస్తాను‘ అని హామీ ఇచ్చిన ట్రంప్‌కు ఈ ఒత్తిళ్లు వెనక్కిపడేలా చేశాయి.

ఆర్థిక భారం..
పర్షియన్‌ గల్ఫ్‌లోని హర్మూజ్‌ జలసంధి నియంత్రణ సాధించడం అమెరికాకు దీర్ఘకాలిక, భారీ ఖర్చుతో కూడిన ప్రక్రియ. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ మార్గానే ప్రవహిస్తుంది. ఇక్కడ పట్టు బిగించాలంటే ఇరాన్‌ భూభాగంలో 600 కి.మీ. ప్రాంతంపై సైన్యం ఉంచాలి. ఇరాన్‌ క్షిపణులను అడ్డుకోవాలంటే 30 వేల నుంచి 45 వేల మంది సైనికులు, నావికాదళం అవసరం. అఫ్గానిస్తాన్, వియత్నాం యుద్ధాల్లో ఎదుర్కొన్న ఆర్థిక నష్టాలు(లక్షల కోట్ల డాలర్లు) ట్రంప్‌ను పునరాలోచనలో పడేశాయి. ఈ ఖర్చు రాజకీయంగా కూడా భారం.

రెండు వారాలు కూల్‌
రెండు వారాల కాల్పుల విరమణ ట్రంప్‌కు సుపరిచిత కాలవ్యవధి. ఇరాన్‌పై దాడి నిర్ణయానికి ముందు ఆయన ఇచ్చిన గడువు రెండు వారాలే. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాన్ని పరిష్కరించేందుకు పలుమార్లు ప్రకటించిన సమయం కూడా అంతే. ఆరోగ్య విధానాలు, వాణిజ్య ఒప్పందాల్లో కూడా ఈ ’కూలింగ్‌ ఆఫ్‌’ పీరియడ్‌ ట్రంప్‌ ఎంపిక. ఇది ఒత్తిళ్లు, ఆచరణాత్మకతలను అంచనా వేసే అవకాశం ఇస్తుంది.

ట్రంప్‌ బెదిరింపులు ఇరాన్‌ను చర్చలకు ఒప్పించి, తాత్కాలిక విరమణకు దారితీశాయి. కానీ రెండు వారాలు మాత్రమే. ఇది శాశ్వత పరిష్కారం కాదు. చైనా–పాక్‌ మధ్యవర్తిత్వం, ఆర్థిక భారం, ఆంతరిక రాజకీయ ఒత్తిడి అమెరికాను తగ్గేలా చేశాయి. పశ్చిమాసియాలో ఈ సీజ్‌ఫైర్‌ షియా–సున్నీ టెన్షన్స్‌ను తగ్గించవచ్చు, కానీ హర్మూజ్‌ నియంత్రణ లక్ష్యం దూరమైతే అమెరికా వ్యూహం మారుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper