Prabhas- Deepika Padukone: ప్రభాస్ ఎవరినీ అంత సులభంగా పొగడరు. మనసులో ఉన్నా అంత ఈజీగా బయటపెట్టరు. ఆయన బాగా సిగ్గరి. చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. అందుకే తన మూవీ ప్రమోషన్స్ కోసం మాత్రమే ఆయన మీడియా ముందుకు వస్తారు. ఇటీవల ప్రభాస్ ఓ ఇంటర్నేషనల్ ఈవెంట్లో పాల్గొన్నారు. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ జులై 20న అమెరికాలో జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న మొట్టమొదటి ఇండియన్ మూవీగా కల్కి నిలిచింది. కల్కి టైటిల్ అండ్ టీజర్ అక్కడ ఆవిష్కరించారు.
కల్కి చిత్ర యూనిట్ కమల్ హాసన్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీ దత్ సైతం పాల్గొన్నారు. అలాగే వీరితో నటుడు రానా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన ప్రభాస్ దీపికా పదుకొనెపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దీపికా పదుకొనె చాలా అందంగా ఉంటారు. ఆమెకు వరల్డ్ వైడ్ ఫేమ్ ఉంది. ఆమెతో కలిసి నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. కల్కి మూవీతో అది తీరింది. కల్కి సెట్స్ లోకి దీపికా పదుకొనె వస్తే చాలా సందడిగా మారిపోతుందని… ప్రశంసలు కురిపించాడు.
ఒక హీరోయిన్ గురించి ప్రభాస్ గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో పొగడలేదు. దీపికా పదుకొనె మీద ఆయనకున్న అభిమానాన్ని ఈ కామెంట్స్ తెలియజేస్తున్నాయి. కల్కి మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైం ఆమె ఒక టాలీవుడ్ మూవీ చేస్తున్నారు. కల్కి చిత్రంలో దీపికా పాత్రపై ఆసక్తి నెలకొని ఉంది. కల్కి కోసం దీపికా పది కోట్లకు పైగా తీసుకున్నారని సమాచారం.
ఇక కల్కి 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆలస్యం అవుతుందనే మాట వినిపిస్తోంది. కల్కి విడుదల ఆగస్టు కి షిఫ్ట్ కావచ్చంటున్నారు. కల్కి చిత్రానికి సీక్వెల్ లేదని నాగ్ అశ్విన్ ప్రకటించడం విశేషం. పస్తుతానికి ఆ ఆలోచన లేదు. కామిక్ వెర్షన్ మాత్రం రూపొందించాలని అనుకుంటున్నాను అన్నారు.