Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) అభిమానులు ప్రస్తుతం ‘రాజా సాబ్’ మూవీ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏడాదికి కచ్చితంగా రెండు సినిమాలను విడుదల చేస్తానని అభిమానులకు ప్రభాస్ అనేక సార్లు మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం చేస్తూ వచ్చాడు కానీ, కల్కి తర్వాత మాత్రం స్పీడ్ తగ్గించాడు. ఆ సినిమా విడుదలై ఏడాది పూర్తి అయినా కూడా ప్రభాస్ నుండి మరో సినిమా రాకపోవడం తో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అసలు ఈ ఏడాది ప్రభాస్ నుండి సినిమా వస్తుందా అని అనుకుంటున్న సమయం లో ‘రాజా సాబ్’ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు మేకర్స్. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ తో ప్రభాస్ మరో వెయ్యి కోట్ల గ్రాస్ కొట్టబోతున్నాడని స్పష్టంగా అర్థం అవుతుంది.
ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ ఎన్ని సూపర్ హిట్స్ కొట్టినా, అభిమానుల్లో ఒక చిన్న వెలతి ఉండేది. అదేమిటంటే ఆయన లుక్స్. బాహుబలి సిరీస్ లో, అంతకు ముందు సినిమాల్లో ప్రభాస్ లుక్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి?, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంటూ అభిమానులు బాధ పడేవారు. కానీ రీసెంట్ లుక్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. హను రాఘవపూడి మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ తో కొంతమంది అభిమానులు ఫోటో తీసుకున్నవి సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యాయి. వీటిల్లో ప్రభాస్ లుక్స్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఒక పక్క అభిమానులు ఇలా ఉంటే, మరో పక్క యాంటీ ఫ్యాన్స్ మాత్రం వేరే లెవెల్ లో ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ హెయిర్ స్టైల్స్ మారుతూ ఉన్నాయని, ఒకసారి పొడవుగా ఉంటే, మరోసారి మరోలా ఉందని, కచ్చితంగా ప్రభాస్ విగ్ వాడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రెండు రోజుల్లో ఇన్ని వేరియేషన్స్ అంటే కచ్చితంగా విగ్ వాడకం అయ్యి ఉంటుందని, ప్రభాస్ కి బట్ట తల వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. మరో పక్క ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తూ, మీరు ట్రోల్ చేసే లుక్స్ తోనే వందల కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతున్నాడు మా హీరో. ఒకవేళ వింటేజ్ లుక్స్ లోకి వస్తే ఇంకెన్ని రికార్డ్స్ బద్దలు కొడుతాడో మీ ఊహలకే వదిలేస్తున్నాం అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు
Types of Wigs Prabhas Using in Movies pic.twitter.com/hy7ZcGj1LN
— тσηʏ ⚡ (@TheTony69_) June 29, 2025