Prabhas Raja Saab Look: ‘కల్కి’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్(Rebel Star Prabhas) చేస్తున్న ‘రాజా సాబ్'(Raja Saab Movie) మూవీ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదట్లో ఈ సినిమాపై అంచనాలు కాస్త అటు ఇటుగా ఉండేవి. అభిమానుల నుండి కూడా బలమైన సపోర్టు ఉండేది కాదు. కానీ ఎప్పటి నుండి ఈ సినిమా లోని కంటెంట్ ఒక్కొక్కటిగా బయటకి రావడం మొదలైందో అప్పటి నుండి అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకున్నాయి. ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసే విధంగా రేపు ఈ చిత్రం నుండి ఒక టీజర్ ని విడుదల చేయబోతున్నారు. రేపు ఉదయం 10 గంటల 52 నిమిషాలకు ఈ టీజర్ విడుదల కాబోతుంది. కాసేపటి క్రితమే ఈ టీజర్ కి సంబంధించిన ప్రీ టీజర్ ని విడుదల చేశారు మేకర్స్.
ఇప్పుడు కొద్ది క్షణాల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన బ్రాండ్ న్యూ పోస్టర్ ని విడుదల చేసింది మూవీ టీం. ప్రభాస్ స్టైల్ గా కార్ మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఇచ్చిన ఒక స్టిల్ కి ఫ్యాన్స్ మెంటలెక్కిపోతున్నారు. ఇది కదా మేము ప్రభాస్ నుండి కోరుకున్నాడు. మాకు బుజ్జిగాడు సినిమా సమయంలో ఎలాంటి ప్రభాస్ కనిపించేవాడో, ‘రాజా సాబ్’ లో అలాంటి ప్రభాస్ కనిపిస్తున్నాడు. ఇలాంటి ప్రభాస్ ని చూసి చాలా కాలం అయ్యింది, మా ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్ పక్కా లాగా అనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రేపు విడుదల కాబోయే టీజర్ లో కూడా ప్రభాస్ కామెడీ టైమింగ్ తో కూడిన డైలాగ్స్ అదిరిపోతాయట. అంతే కాకుండా ఆయన మార్క్ హీరోయిజం కూడా ఉంటుందట. చూడాలి మరి టీజర్ విడుదలకు ముందు వచ్చిన టాక్ ఎంత వరకు నిజం అవుతుంది అనేది. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్(Malavika Mohanan) నటించారు.
Make way for the SWAG WAVE of #TheRajaSaab #TheRajaSaabTeaser Tomorrow at 10:52AM.#Prabhas pic.twitter.com/EmTwpVQdr2
— The RajaSaab (@rajasaabmovie) June 15, 2025