Prabhas : ఇంతకుముందు బాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగేది. అప్పుడు తెలుగు సినిమాలను వాళ్ళు పట్టించుకునే వారు కాదు. సినిమాలు చేయాలంటే మేమే మమ్మల్ని ఢీకొట్టే వారు ఎవరూ లేరు అనే తల పొగరుతో ఉండేవారు. కానీ ప్రభాస్ ఎప్పుడైతే బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి బాలీవుడ్ హీరోల క్రేజ్ మొత్తం పడిపోయింది. ఇండియాలో ప్రస్తుతం ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)… ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తదుపరి చేస్తున్న సినిమాలన్నింటితో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా సంపాదించి పెట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి రాబోతున్న సినిమాలు ఎలాంటి విజయాలను సాధిస్తాయి. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి (Hanu Rghavapudi) దర్శకత్వంలో ఫౌజి (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరు సాధించినటువంటి గొప్ప విజయాలను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నటువంటి ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
Also Read :ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?
ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా మీద ఇప్పటికే భారీ కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే రీసెంట్ గా ప్రభాస్ తన షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి 5 కోట్లు పెట్టి టూర్ వెళ్తున్నాడు అనే ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. నిజానికి ప్రభాస్ టూర్ కి వెళ్లడానికి గల కారణం ఏంటి అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రభాస్ కాలు ఇంజ్యూర్ అయినదని దానివల్ల ఆయన టూర్ అని చెప్పి దానిని సర్జరీ చేయించుకోవడానికి వెళ్తున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి ఇంతకుముందులా ఉండటం లేదనేది వాస్తవం…ఆయన తరచుగా ఇటలీ వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే ప్రభాస్ ఆరోగ్యం అంతలా చెడిపోయింది… ఇక రాను రాను రోజుల్లో ప్రభాస్ డూప్ ను పెట్టుకొని ఎక్కువ సినిమాలను చేస్తూ ఓన్లీ క్లోజ్ లు మాత్రమే ఆయన మీద చేయాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…