Prabhas latest looks: బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్(Rebel Star Prabhas) కి మూడు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్,రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. కానీ అభిమానుల్లో ఒక చిన్న కంప్లైంట్ ఉండేది. బాహుబలి రోజుల్లో ప్రభాస్ లుక్స్ ఎలా ఉండేవి,ఇప్పుడు ఎలా తయారు అయ్యాయి, అసలు ఆ వింటేజ్ లుక్స్ ఏమయ్యాయి?, సినిమా బాగున్నా బాగాలేకపోయిన వెండితెర మీద రెండు గంటలపాటు ప్రభాస్ అందాన్ని చూసేందుకు వెళ్లే ఆడియన్స్ లక్షల్లో ఉంటారు, వాళ్లందరికీ ప్రభాస్ రీసెంట్ లుక్స్ పై చాలా అసంతృప్తి ఉండేది. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు అంటూ కామెంట్స్ చేసేవాళ్ళు. గడిచిన 5 సినిమాల్లో ప్రభాస్ లుక్స్ కాస్త పర్వాలేదు అని అనిపించింది కేవలం ‘సలార్’ లో మాత్రమే. అయితే ఇప్పుడు ప్రభాస్ మళ్ళీ తన వింటేజ్ లుక్స్ లో వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడని రీసెంట్ గా సోషల్ మీడియా లో లీకైన ఒక ఫోటో ని చూస్తే అర్థం అవుతుంది.
హను రాఘవపూడి(Hanu Raghavapudi) తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ'(Fauji Movie) మూవీ కోసం ప్రభాస్ ఈ రేంజ్ లో తయారు అయ్యాడు. అభిమానులు ఈ లుక్స్ ని చూసి మురిసిపోతున్నారు. మొన్న విడుదలైన ‘రాజా సాబ్’ టీజర్ లో ప్రభాస్ తనలోని వింటేజ్ కామెడీ టైమింగ్ ని బయటకు తీస్తే, హను రాఘవపూడి వింటేజ్ లుక్స్ ని బయటకు తీస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన సందీప్ వంగ తో చేయబోయే ‘స్పిరిట్’ చిత్రం తో పూర్తి స్థాయి వింటేజ్ ప్రభాస్ బయటకు వస్తాడని అభిమానులు బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంత వరకు నిజం అవ్వబోతుందో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు పూర్తి జరిగాక ఆయన రాజా సాబ్ మిగిలిన బ్యాలన్స్ షూట్ ని పూర్తి చేయబోతున్నాడు.
Also Read: అనుష్క ‘ఘాటీ’ విడుదల వాయిదా..డైరెక్టర్ క్రిష్ కొంప ముంచేశాడుగా!
ఈ చిత్రం డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఎక్కువ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ లోకల్ మాస్ మూవీస్ కి దూరం అయ్యాడు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాలను చూడడం దాదాపుగా మానేశారు. ఇప్పుడు తనకు ఉండే ఆ ఆడియన్స్ ని మళ్ళీ థియేటర్స్ కి రప్పించాలంటే కచ్చితంగా లోకల్ మాస్ మూవీ కావాలి. అది ‘రాజా సాబ్’ అయ్యి తీరుతుందని అభిమానులు బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీజర్ తోనే ఫ్యాన్స్ కి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసింది. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటే మరో వెయ్యి కోట్ల సినిమా లోడింగ్ అన్నమాట. అదే కనుక జరిగితే దేశవ్యాప్తంగా మూడు వెయ్యి కోట్ల గ్రాస్ సినిమాలు ఉన్న ఏకైక హీరో గా ప్రభాస్ చరిత్ర లో నిలిచిపోతాడు.