Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఈశ్వర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో నటుడిగా తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన ఒకటి, రెండు సినిమాలు కొద్దిగా తడపడినప్పటికి మళ్లీ వర్షం సినిమాతో తనకంటూ ఒక స్టార్ డం ని క్రియేట్ చేసుకున్నాడు.
ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ఇదే క్రమంలో రాజమౌళితో చేసిన ఛత్రపతి సినిమా అయితే మాస్ లో అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది…ఇక ఇదే క్రమంలో ఛత్రపతి కంటే ముందే రాజమౌళి ప్రభాస్ తో సింహాద్రి సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.కానీ రాజమౌళి చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ప్రభాస్ కి పెద్దగా నచ్చలేదు దాంతో రాజమౌళి తో సినిమా అనగానే ప్రభాస్ సింహాద్రి స్టోరీ వినకుండానే దానికి చెప్పాడట. ఇక అప్పుడు రాజమౌళి తన ఫస్ట్ సినిమా తీసిన జూనియర్ ఎన్టీఆర్ తోనే సింహాద్రి సినిమాను చేశాడు.అయితే ఆ సినిమాని స్క్రీన్ మీద చూసిన ప్రభాస్ రాజమౌళి మేకింగ్ చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయాడట అనవసరంగా నేనే ఈ సినిమాను మిస్ చేసుకున్నాను అంటూ తనలో తనే కుమిలిపోయాడట.
ఇక ఇదే విషయాన్ని రాజమౌళి కలిసినప్పుడు కూడా ప్రభాస్ అతనితో చెప్పడట దానికి రక్పులి నవ్వుకున్నాడట. అయితే వీళ్ళ కాంబినేషన్ సింహాద్రి సినిమా మిస్ అయినప్పటికీ ఆ తరువాత రాజమౌళి ప్రభాస్ తో ఛత్రపతి సినిమా చేశాడు. ఇక అది మాత్రం వీళ్ళ కాంబినేషన్ లోనే వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది.ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ మాత్రం ఇప్పటికీ అతని కెరియర్ లో ఏదైనా రిగ్రేట్ అయిన విషయం ఉంది అంటే అది సింహాద్రి సినిమాని తను చేయకపోవడమే అంటూ అప్పుడప్పుడు తన సన్నిహితుల దగ్గర చెప్తూ బాధపడుతూ ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు.
ఇక నిజానికి సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కంటే ప్రభాస్ కి కూడా బాగా సెట్ అయ్యేదని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు.ఇక ఇదే క్రమంలో ఇప్పుడు ప్రభాస్ వరుస సినిమాలను చేస్తూ రాజమౌళి తీసిన బాహుబలి తోనే పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనే సలార్ సినిమా చేశాడు ఈ సినిమా ఈనెల 22 వ తేదీన రిలీజ్ కి రెఢీ అయింది…