
Mulberry Fruit : మనకు ఎండాకాలంలో పండ్లు విరవిగా లభిస్తాయి. ఇందులో మామిడి,పుచ్చ, మల్బరీ, అల్లనేరేడు పండ్లు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమసైనవి. వీటిని తినడం వల్ల మనకు పోషకాలు అందుతాయి. వేసవిలో లభించే మల్బరీ పండ్లలో ఇనుము, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వేసవి కాలంలో ఎక్కువగా లభించే మల్బరీ పండ్లతో మనకు ఎన్నో లాభాలున్నాయి. ఇవి ఎరుపు, నలుపు, తెలుపు వంటి రంగుల్లో ఉంటాయి. ద్రాక్ష పండ్ల రుచిని పోలి ఉంటాయి. వీటితో జాములు, సిరప్ లను తయారు చేస్తారు. మల్బరీ పండ్లను తినడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సంప్రదాయ చైనీస్ వైద్యంలో వీటని ఉపయోగిస్తారు. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. కణాలు, కణజాలాల్లో ఏర్పడే క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తాయి. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మల్బరీ పండ్లు తినడం శ్రేయస్కరం. మల్బరీ పండ్లు తినడంతో మన ఆరోగ్యం బాగుపడుతుంది.

మన శరీరంలో పేరుకుపోయే చక్కెరను తగ్గించడంలో ఇవి తోడ్పడతాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. దీంతో రక్తంలో చక్కెర పెరిగిపోతుండటంతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి ఇవి దివ్యౌషధంగా ఉపయోగపడతాయి. దీంతో మల్బరీ పండ్లు తినడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది.
మల్బరీ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ బాగుంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండటంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గించేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. చర్మ ఆరోగ్యానికి ఇవి సహకరిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల సామర్థ్యంతో ముడతలు లేకుండా పోతాయి. ఇలా మల్బరీ పండ్లతో ఎన్నో రకాల లాభాలు ఉన్నందున వీటిని తినడం మంచిదే.