Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పెద్దనాన్న గారు రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారు ఇటీవలే స్వర్గస్తులైన సంఘటన యావత్తు తెలుగు రాష్ట్ర ప్రజలను శోక సంద్రం లో ముంచేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఇప్పటికి ఈ శోకం నుండి బయటపడలేదు..ప్రభాస్ అయితే కృష్ణంరాజు గారి చనిపోయిన రోజు చిన్నపిల్లవాడిలాగా ఏడుస్తూ ఉన్న వీడియోస్ చూసి మనం ఎంత భావోద్వేగానికి లోనైయ్యామో మన అందరికి తెలిసిందే..అయితే కృష్ణం రాజు గారు చనిపోయి సరిగ్గా 20 రోజులు కావొస్తున్నా సందర్భంగా నిన్న ప్రభాస్ కృష్ణం రాజు గారి సొంత ఊరైన మొగల్తూరు లో సమ్మసరణ సభ ని కనివిని ఎరుగని రీతిలో చరిత్ర లో ఎప్పటికి నిలిచిపొయ్యే విధంగా మొగల్తూరు గ్రామస్తులందరికి విందు భోజనం ఏర్పాటు చేసాడు..సుమారు లక్ష మందికి పైగా నిన్న ఈ విందు కి హాజరై భోజనం చేసి వెళ్లారు..చరిత్ర చూసుకుంటే ముందు కానీ వెనుక కానీ ఇలాంటి మహా సంస్మరణ సభని నిర్వహించిన వాళ్ళు భారత దేశం లో ఎక్కడ కూడా లేరు.

ప్రభాస్ తన పెద్దనాన్న గారి మీద ఉన్న ప్రేమ ని ఈ విధంగా చాటుకున్నాడు..కృష్ణం రాజు గారు గొప్ప భోజన ప్రియులు..ఆయన తినడమే కాకుండా పదిమందికి కడుపు నిండా తిండి పెట్టడం అంటే ఆయనకీ మహా ఇష్టం..తన ఇంటికి వచ్చిన అతిధులను సొంత వాడిలా చూసుకుంటూ రకరకాల వంటకాలను వండించి పెట్టడం కృష్ణంరాజు గారికి అలవాటు..ప్రభాస్ కి కూడా ఆ అలవాటు కృష్ణం రాజు గారి దగ్గర నుండి వారసత్వం గా వచ్చింది..అందుకే కృష్ణం రాజు గారి ఆత్మకి సంతృప్తి చెందడం కోసం ప్రభాస్ ఈ స్థాయి మహా విందు ని ఏర్పాటు చేసాడు..ఈ విందు కోసం ప్రభాస్ దాదాపుగా 10 కోట్ల రూపాయిలు ఖర్చు చేసాడట..సుమారు 15 వెరైటీ వంటకాలతో ఫైవ్ స్టార్ హోటల్ మెన్యు ని తలపించేలా వంటకాలు వండిచాడట.
Also Read: Atharintiki Daaredi: అత్తారింటికి దారేది సినిమాలో పది సీక్రెట్లు ఉన్నాయి.. అవేంటో తెలుసా?

9 టన్నుల మటన్, 6 టన్నుల చికెన్, 6 టన్నుల ప్రాన్స్ , 4 టన్నుల ఫిష్ వంటకాలతో పాటు వెజిటేరియన్స్ కోసం ప్రత్యేకమైన మెన్యు ని కూడా తయారు చేయించాడట..అయితే ఇండియా లో ఎవ్వరు చెయ్యని విధమైన గొప్ప పనిని చేసిన ప్రభాస్ విందు ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కించేందుకు అభిమానులు ప్రయత్నిస్తున్నారట..ఇందుకోసం జరగాల్సిన ప్రక్రియ కూడా ప్రారంభించినట్టు సమాచారం..మరి ప్రభాస్ విందు భోజన కార్యక్రమం గిన్నిస్ బుక్ కి ఎక్కుతుందా లేదా అనేది.