Prabhas Marriage: ఆరు అడుగుల హైట్, చూడగానే నచ్చే ఫేస్, పాన్ ఇండియా స్టార్, వందల కోట్ల సంపాదన.. షార్ట్ గా చెప్పాలంటే ప్రభాస్ ప్రొఫైల్ ఇది. టాలీవుడ్ అందగాడు ప్రభాస్ ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి దేశ విదేశాలకు చెందిన అందమైన అమ్మాయిలు క్యూలో నిల్చుంటారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు. 42 ఏళ్ళు దాటిపోయినా… పెళ్లి మాట ఎత్తడం లేదు. బాహుబలి 2 విడుదలై ఐదేళ్లు అవుతుంది. అప్పటి నుండి ప్రభాస్ పెళ్లిపై పుకార్లు చెలరేగుతూనే ఉన్నాయి. అదిగో పెళ్లి ఇదిగో అమ్మాయి అంటూ కథనాలు పుట్టుకొస్తున్నాయి.
ప్రముఖంగా ప్రభాస్… హీరోయిన్ అనుష్కను పెళ్లాడనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రశ్న కొన్ని మీడియా సంస్థలు నేరుగా ప్రభాస్ ని అడగడం జరిగింది. అడిగిన ప్రతిసారీ ప్రభాస్ సహనంగా కాదని చెప్పి తప్పించుకున్నారు. వయసు దాటిపోతున్నా… అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడంతో ఈ పుకార్లకు బలం చేకూరింది. మొత్తంగా అనుష్క నాకు ఫ్రెండ్ మాత్రమే, ఆమెను పెళ్లి చేసుకుంటున్నాని వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రభాస్ తేల్చేశాడు.
Also Read: Pooja Hegde: పూజాహెగ్డేను విమానంలో అలా చేశారట.. ట్వీట్ కలకలం
వెంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లు… ప్రభాస్ పెళ్లి పెదనాన్న కృష్ణంరాజుకు తలనొప్పిగా మారింది. ఆయన ఎక్కడెక్కినా ప్రభాస్ పెళ్లెప్పుడు అని అడుగుతున్నారు. తాజాగా కృష్ణంరాజుకు ఇదే ప్రశ్న ఎదురుకాగా స్పష్టత ఇచ్చారట. 2022లోనే ప్రభాస్ వివాహం ఉంటుందన్నారట. దాదాపు వచ్చే శ్రావణమాసం లో ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఆయన పరోక్షంగా చెప్పినట్లు సమాచారం అందుతుంది. కృష్ణంరాజుతో పాటు గోదావరి జిల్లాలకు చెందిన ప్రభాస్, కృష్ణంరాజు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఇదే అభిప్రాయం వెల్లడించినట్లు తెలుస్తుంది.
కాగా అమ్మాయి ఎవరనే వివరాలు వెల్లడించలేదట. అమ్మాయి గురించి చెబితే మీడియా ఫోకస్ ఎక్కువై, వార్తలు పుట్టుకొచ్చే ఆస్కారం కలదని పేరు , వివరాలు గోప్యంగా ఉంచి ఉండవచ్చు. మరి ప్రచారం అవుతున్న వార్త నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరోవైపు ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఏక కాలంలో ఆయన ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. 2023 జనవరిలో ఆదిపురుష్ విడుదల కానుంది. అలాగే దర్శకుడు మారుతి తో చేస్తున్న మూవీ ఇదే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.
Also Read:Mahesh Babu Favorite Food: మహేష్ బాబు ఇంత అందంగా ఉండడానికి ఏం తింటాడో తెలుసా?