Pooja Hegde: అందాల తార పూజాహెగ్డే. అనతి కాలంలోనే ఎంతో ఖ్యాతి సంపాదించుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. అగ్ర హీరోలతో నటిస్తూ ఆమె తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాంచరణ్ లాంటి హీరోలతో కలిసి నటిస్తూ ఔరా అనిపించుకుంటున్న ఈ భామకు ఓ చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రయాణించే విమానంలో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంపై ట్విటర్ లో పోస్టు చేసింది. దీంతో నెటిజన్లు ఇండిగో విమాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి విమాన సిబ్బంది క్షమాపణలు చెబుతూ మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది.
ముంబై నుంచి వచ్చే విమానంలో విపుల్ నకాషే అనే పేరు గల వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నా తప్పు ఏం లేకున్నా తనపై చిందులేశాడని పేర్కొంది. దీంతో ప్రేక్షకులు స్పందించారు. విమానసంస్థపై విమర్శలు చేశారు. దీనిపై సంస్థ స్పందించి మీ వివరాలు పంపితే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీంతో పూజా వారికి సంబంధించిన అన్ని విషయాలు తెలియజేసినట్లు తెలుస్తోంది.
Also Read: Somu Veerraju: ఆత్మకూరులో కనిపించని బీజేపీ మీడియా పులులు.. సోము వీర్రాజు ఒంటరి పోరాటం
విమాన సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పూజా ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీలతో అలా ప్రవర్తించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం కాస్త వైరల్ అయింది. దీంతో విమాన సంస్థ తన తప్పును తెలుసుకుని విమాన సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించింది. ఉద్యోగస్తులు గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలని సూచించింది. పూజా హెగ్డేకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది.
హీరోయిన్లకు వివాదాలు కొత్త కాదు. వారు ఎప్పుడు సోషల్ మీడియాలో ప్రేక్షకులతో సరదాగా గడుపుతూనే ఉంటారు. ఈ మేరకు ఈ సంఘటన కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో వివాదం కాస్త పెద్దదయింది. దీంతో విమాన యాన సిబ్బందిపై వేటు పడింది. వినియోగదారులతో సక్రమంగా మసలుకోవాలని సూచించింది. ఇక మీదట ఇలాంటి ఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.