Prabhas Kanappa Scene : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్స్ సినిమాలు తీసే స్టైల్ పూర్తిగా మార్చేశారు. ఒకప్పుడు రొటీన్ రొట్ట సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా మేకింగ్ మొత్తం మారిపోయింది. రొటీన్ కథలకు కాలం చెల్లిపోయింది. కొత్త కథలతో ఎక్స్పరిమెంట్లు చేసిన వాళ్లకు మాత్రమే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అయితే దక్కుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే చాలామంది యంగ్ హీరోలు మన సినిమాలను చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు (Mohan Babu)… ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండేవి. కానీ ఆయనకు ఇప్పుడు మార్కెట్ లేకపోవడంతో తన కొడుకుల సినిమాల్లోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. తన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు (Vishnu) సైతం భారీ సక్సెస్ లను సాధించడంలో చాలావరకు వెనుకబడిపోయాడు.
యంగ్ హీరోలు మంచి సక్సెస్ లను సాధిస్తున్న క్రమంలో మంచి విష్ణు మాత్రం ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్న కూడా ఇప్పటివరకు ఒక్కటి కూడా సరైన సక్సెస్ అయితే సాధించలేదు. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న కన్నప్ప సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. ఇక ఇందులో ప్రభాస్ నటిస్తుండడం ఈ సినిమాకి చాలా వరకు కలిసి వస్తుందనే చెప్పాలి. ప్రభాస్ గురించిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అది ఏంటి అంటే ఇందులో ప్రభాస్ పాత్ర ఇంట్రడక్షన్ అదిరిపోయేలా ఉంటుందని ఆయన ఆకాశం పైనుంచి భూమి మీదికి వచ్చే సీన్ చాలా ఎక్స్ట్రాడినరీ తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ వల్లే ఈ సినిమాకి భారీగా మార్కెట్ అయితే క్రియేట్ అయింది.
ఇక మంచు విష్ణు తను అనుకున్నట్టుగా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? తద్వారా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా కనక డిజాస్టర్ అయితే మాత్రం ఆయన భారీగా నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది… ఇక ఈ మూవీ రిలీజ్ కి మరొక ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి ఫ్రీగా వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…