Little Hearts Collection: చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని నెలకొల్పుతున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్'(Little Hearts Movie). ప్రముఖ యూట్యూబర్, స్టాండప్ కమెడియన్ మౌళి హీరోగా, శివాని నాగారం హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదలకు ముందు ట్రైలర్ తోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మౌళి మరియు మూవీ టీం కూడా ప్రొమోషన్స్ ని ఇరగదీశారు. కంటెంట్ మీద బలమైన నమ్మకం ఉండడం తో, విడుదలకు ముందు రోజే ప్రీమియర్ షోస్ వేశారు. ఈ ప్రీమియర్ షోస్ ద్వారా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో ఓపెనింగ్స్ మొదటి రోజు నుండే అదిరిపోయాయి. అయితే మొదటి రోజు వచ్చిన ఓపెనింగ్ కంటే మిగిలిన ఆరు రోజుల్లో వచ్చిన ఓపెనింగ్ వసూళ్లే ఎక్కువ. వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం.
Also Read: ‘తెలుసు కదా ‘ టీజర్ రివ్యూ : ఇద్దరి మధ్యన నలిగిపోయిన సిద్దూ…
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి వారం ఒక్క నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, సీడెడ్ ప్రాంతం నుండి 77 లక్షలు, ఆంధ్ర ప్రాంతం 3 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా మొదటి వారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 8 కోట్ల 29 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 7 వ రోజు కూడా ఈ చిత్రానికి 85 లక్షల రూపాయలకు పైగా షేర్ వసిఇఓలు వచ్చాయి. ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. మన తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ రావడం వేరు ఇతర రాష్ట్రాల నుండి కూడా అద్భుతమైన వసూళ్లు రావడం వేరు.
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. కేవలం ఇతర రాష్ట్రాల నుండే 4 కోట్ల రూపాయిలు వచ్చాయి. అంటే కొన్న రేట్ కి మొదటి వారం లో కోటి లాభం ఇతర రాష్ట్రాల వసూళ్లను కలుపుకొని వచ్చింది అంటే ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 23 కోట్ల రూపాయలకు పైగా వచ్చింది. ఊపు చూస్తుంటే ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ చిత్రం 40 కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రేంజ్ స్టడీ రన్ కనిపిస్తుంది. చూడాలి మరి లాంగ్ రన్ ఇంకా ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.