https://oktelugu.com/

‘రాధే శ్యామ్’ కోసం హాస్పిటల్ లో ప్రభాస్ !

నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించాక కూడా ప్రభాస్, హిట్ అండ్ ఫేమ్ కూడా లేని రాధాకృష్ణ కుమార్ అనే ‘జిల్’ మూవీ డైరెక్టర్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే ఓ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్దగా నమ్మకం లేకపోయినా, వాళ్ళు మాత్రం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 6 […]

Written By:
  • admin
  • , Updated On : June 24, 2020 / 02:44 PM IST
    Follow us on


    నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించాక కూడా ప్రభాస్, హిట్ అండ్ ఫేమ్ కూడా లేని రాధాకృష్ణ కుమార్ అనే ‘జిల్’ మూవీ డైరెక్టర్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే ఓ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్దగా నమ్మకం లేకపోయినా, వాళ్ళు మాత్రం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 6 కోట్ల రూపాయల ఓ భారీ హాస్పిటల్ సెట్‌ ను ప్రస్తుతం మేకర్స్ నిర్మిస్తున్నారు.

    లాక్ డౌన్ విధించాలంటున్న నెటిజన్లు.. పట్టించుకోని సర్కార్

    మరో నలబై రోజుల్లో ఈ సెట్ పూర్తి చేయనున్నారు. ఆ తరువాత ఆ హాస్పిటల్ సెట్‌ లోనే ప్రభాస్ పై కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారు. అన్నట్టు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ గాసిప్ కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. సినిమాలో ప్రభాస్ పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని, మెయిన్ గా క్లైమాక్స్ లో చాలా భావోద్వేగంతో సాగుతూ ఎమోషనల్ గా ముగుస్తోందని.. అనగా సినిమాలో ప్రభాస్ వి రెండు క్యారెక్టర్స్.. అందులో ఒక క్యారెక్టర్ చనిపోతుందని.. కొంతమంది సినిమా మిత్రుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

    చంద్రబాబు కోటరీ బీజేపీని దెబ్బతీస్తుందా?

    ఇక జిల్ సినిమాని బాగానే తెరకెక్కించిన డైరెక్టర్ రాధాకృష్ణ‌, ఆ సినిమాతో హిట్ ను మాత్రం అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్ కొడితేనే రాధాకృష్ణకు డైరెక్టర్ గా లైఫ్ ఉంటుంది. మరి రాధాకృష్ణ ఏం చేస్తాడో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని నాలుగు భాషల్లో గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.