Prabhas helps his fan Ramesh family
Prabhas: ప్రభాస్ భోళా శంకరుడు. తన సంపాదనలో కొంత భాగం దానధర్మాలకు కేటాయిస్తారు. కోవిడ్ సంక్షోభంలో ప్రభాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు. కేంద్రానికి రూ. 3 కోట్లు ఇచ్చారు. అలాగే ఏపీ/తెలంగాణ రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు ఆయన డొనేట్ చేయడం జరిగింది. ఇటీవల తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కి రూ. 35 లక్షలు విరాళంగా ఇచ్చారు. మనకు తెలియని గుప్త దానాలు ఆయన చాలానే చేస్తారు.
తన తోటి నటులకు అరుదైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. ప్రభాస్ తో పని చేసిన నటులు, హీరోయిన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రభాస్ ఆతిథ్యం మామూలుగా ఉండదని వారు ఫిదా అయ్యారు. సెట్స్ లో ప్రతి ఒక్కరు మంచి ఆహారం తినేలా ప్రభాస్ చూసుకుంటారనే వాదన ఉంది. తాజాగా ప్రభాస్ అభిమాని మృతి వార్త తెలుసుకున్న స్పందించారు. ఆర్థిక సహాయం అందించారు.
కరీంనగర్ జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఉన్న రమేష్ ఇటీవల మరణించాడు. ఆయన చాలా కాలంగా ప్రభాస్ పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభిమాని మృతితో కలత చెందిన ప్రభాస్ ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రభాస్ పీఏ రామకృష్ణ నేడు శనివారం రమేష్ కుటుంబ సభ్యులను కలిశారు. ప్రభాస్ అందించిన ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా… ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్ అభిమాని కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించారని కొనియాడుతున్నారు. మరోవైపు ప్రభాస్ కల్కి 2829 ad విడుదల ఏర్పాట్లలో ఉన్నారు. జూన్ 27న కల్కి వరల్డ్ వైడ్ విడుదల కానుంది. సైన్స్ ఫిక్షన్ మూవీగా భారీ ఎత్తున తెరకెక్కించారు. దీపికా పదుకొనె ప్రధాన హీరోయిన్. అమితాబ్, కమల్ హాసన్ కీలక రోల్స్ చేస్తున్నారు. కల్కి ప్రమోషన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
Web Title: Prabhas helps his fan ramesh family
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com