https://oktelugu.com/

‘రాధేశ్యామ్’పై ఫ్యాన్స్ కు ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కటౌట్ కు తగ్గట్టుగానే అన్ని యాక్షన్ సినిమాలే చేస్తున్నాడు. ఒకటి అర మినహా దాదాపు అన్ని సినిమాల్లో ప్రభాస్ యాక్షన్స్ సీన్స్ థియేటర్లలో మోతమోగాయి. ఇటీవల ప్రభాస్ చేసిన ‘బాహుబలి’.. ‘సాహో’ చిత్రాలు యాక్షన్ సినిమాలే. దీంతో ప్రభాస్ సినిమా అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాల్సిందే అన్న టాక్ అభిమానుల్లో విన్పిస్తోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ‘బాహుబలి’..‘సాహో’ తర్వాత ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీలనే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 04:13 PM IST
    Follow us on

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కటౌట్ కు తగ్గట్టుగానే అన్ని యాక్షన్ సినిమాలే చేస్తున్నాడు. ఒకటి అర మినహా దాదాపు అన్ని సినిమాల్లో ప్రభాస్ యాక్షన్స్ సీన్స్ థియేటర్లలో మోతమోగాయి. ఇటీవల ప్రభాస్ చేసిన ‘బాహుబలి’.. ‘సాహో’ చిత్రాలు యాక్షన్ సినిమాలే. దీంతో ప్రభాస్ సినిమా అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాల్సిందే అన్న టాక్ అభిమానుల్లో విన్పిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ‘బాహుబలి’..‘సాహో’ తర్వాత ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీలనే చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తోంది. ‘రాధేశ్యామ్’ మూవీ పూర్తిగా ప్రేమకథాంశంతో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్.. ఫస్టు లుక్ వంటి చూస్తే ఇది పూర్తిగా క్లాస్ మూవీ అని అర్థమవుతోంది.

    Also Read: బన్నీని ఢీకొట్టడానికి వస్తున్న బాలీవుడ్ నటుడు..!

    ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ఈసందర్భంగా అక్కడి మీడియా ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేయగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘రాధేశ్యామ్’ స్వ‌చ్ఛ‌మైన ప్రేమక‌థ అని చెప్పాడు. ఈ సినిమాలో ఒకేఒక్క యాక్ష‌న్ బ్లాక్ ఉంద‌ని.. అది కూడా మినహాయిస్తే సినిమా మొత్తం ప్రేమ క‌థ చుట్టూనే తిరుగుతుందని తెలిపాడు.

    Also Read: ఫీల్ అయిన శేఖర్ కమ్ముల.. మధ్యలోనే లేచి.. !

    ‘రాధేశ్యామ్’ మూవీలో భావోద్వేగాలే ప్రధానం తప్ప హీరో ఎలివేషన్లు.. యాక్షన్స్ సీన్స్ కు స్కోప్ లేదని తెలిపాడు. ప్రభాస్ ఇమేజ్ కు పూర్తిగా భిన్నంగా ఈ సినిమా రానుండటంతో అభిమానులను ముందస్తుగానే ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. యాక్షన్స్ ఎపిసోడ్ పై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని తేల్చిచెప్పాడు. రాధాకృష్ణ‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ వ‌చ్చే వేస‌వికి విడుద‌ల‌ కానుందని సమాచారం.