Homeఎంటర్టైన్మెంట్ప్రభాస్ కొట్టాడు.. అమితాబ్ నటించాడు !

ప్రభాస్ కొట్టాడు.. అమితాబ్ నటించాడు !

Prabhas Amitabh Bachchanనేషనల్ స్టార్ ప్రభాస్ – యంగ్ క్రేజీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ల కలయికలో రానున్న ఈ సినిమాకి ‘ప్రాజెక్ట్‌ కే’ అనే వర్కింగ్‌ టైటిల్‌ ఫిక్స్ చేస్తూ గురు పూర్ణిమ సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో ప్రభాస్‌ తో పాటు బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ కూడా పాల్గొనడం విశేషం.

ఇక ముహూర్తపు షాట్‌ కి ప్రభాస్‌ క్లాప్‌ కొట్టగా.. బిగ్‌ బీ పై కొన్ని కీలక షాట్స్ ను చిత్రీకరించింది టీమ్. ఈ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే, ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అనేక రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి.

దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా ఫుల్ డిటైల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ డిటైల్స్ ఈ రోజు అయిన మేకర్స్ రివీల్ చేస్తారని ఆశించారు. కానీ మేకర్స్ సింపుల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేసి సినిమా పై ఆసక్తిని రెట్టింపు చేశారు తప్ప, సినిమా గురించి ప్రేక్షకులకు మాత్రం ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు.

ఐతే ఈ సినిమా టీమ్ కి సంబంధించిన వ్యక్తి ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ ఈ సినిమా కథ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదని.. ఇంతవరకూ తెలుగు సినిమా చూడని నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించడానికి నాగ్ అశ్విన్ బాగా కష్టపడుతున్నాడు అని చెప్పుకొచ్చాడు.

మరి ఆ నేపథ్యం ఏమిటో చూడాలి. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది కాబట్టే.. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రీన్‌ప్లే పర్యవేక్షకుడిగా పెట్టుకున్నారు. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular