డార్లింగ్ ప్రభాస్ కాస్త నేషనల్ స్టార్ గా మారిన తరువాత బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో తన స్టార్ డమ్ ను భారత్ లోనే కాకుండా విదేశాల్లో సైతం విస్తరింప చేసుకున్నాడు. దాంతో ప్రభాస్ కి ఉన్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొమ్ము చేసుకోవాలని ఎన్నో ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
కానీ, ప్రభాస్ మాత్రం ఆసక్తి కనబర్చలేదు. బడా కంపెనీలు ఇచ్చిన భారీ ఆఫర్లను సైతం ప్రభాస్ రిజక్ట్ చేశాడు. ఈ క్రమంలో సుమారు రూ.150 కోట్లు విలువ చేసే బ్రాండ్స్ ను కూడా ప్రభాస్ వదులుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కి ఉన్న స్టార్ స్టేటస్ వాడుకోవాలని, ప్రభాస్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకోవాలని కొన్ని భారతీయ అగ్ర వ్యాపార సంస్థలు భావించాయి.
అందుకే, ఏ పాన్ ఇండియా స్టార్ కి ఇవ్వని భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశాయి. కానీ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడం, అలాగే తానూ వాడని బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం ఇష్టం లేకపోవడంతో ఏడాదికి సుమారు రూ.150 కోట్లు విలువ చేసే కాంట్రాక్టులను ఈజీగా వదులుకున్నాడు. ప్రభాస్ మొదటి నుండి డబ్బులు కోసం ఏ యాడ్స్ చేయలేదు.
ప్రజలకు ఉపయోగపడే పని అయితేనే తానూ చేస్తాను కానీ, నా లాభం కోసం ఏది చేయను అంటూ ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా ప్రభాస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ తన రేంజ్ ని రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నాడు. వచ్చే నెలలో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పూర్తి కానుంది. ఆ తర్వాత ప్రశాంత్‌నీల్ తో చేస్తోన్న ‘సలార్’ కోసం ఫుల్ డేట్స్ కేటాయించనున్నాడు. ఆ తరువాత ఓంరౌత్ తో ‘ఆదిపురుష్’ సినిమాని ఫినిష్ చేస్తాడట.