https://oktelugu.com/

Prabhas Food: ప్రభాస్ ప‌ర్ఫెక్ట్‌ గా వండే ఫుడ్ ఇదే, ఎక్కడ వండుతాడో తెలుసా ?

Prabhas Food: నేషనల్ స్టార్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ పేరు వెనుక పాన్ ఇండియా రేంజ్ లో ఎంత‌టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంద‌రికీ తెలుసు. తన సినిమాల ద్వారానే కాకుండా.. తన మంచితనంతో కూడా ప్రభాస్ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. పైగా ప్రభాస్ కి లేడీ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంది. ప్రభాస్ సినిమాలు టీవీల్లో వ‌స్తుంటే మహిళా ప్రేక్ష‌కులు […]

Written By:
  • Shiva
  • , Updated On : July 19, 2022 / 04:05 PM IST
    Follow us on

    Prabhas Food: నేషనల్ స్టార్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ పేరు వెనుక పాన్ ఇండియా రేంజ్ లో ఎంత‌టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంద‌రికీ తెలుసు. తన సినిమాల ద్వారానే కాకుండా.. తన మంచితనంతో కూడా ప్రభాస్ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. పైగా ప్రభాస్ కి లేడీ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంది.

    Prabhas Food

    ప్రభాస్ సినిమాలు టీవీల్లో వ‌స్తుంటే మహిళా ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా వీక్షిస్తుంటారు. మొత్తానికి పాన్ ఇండియా సినిమాల్లో రాణిస్తూ అద‌ర‌గొడుతున్నాడు ప్రభాస్. ముఖ్యంగా బాహుబలి పాత్ర ద్వారా ప్రేక్ష‌కుల‌ను బాగా అల‌రించాడు. ఆ పాత్రలో ప్రభాస్ చాలా బాగా ఒదిగిపోయాడు. ఇదే కాదు.. త‌న సినిమా కెరీర్‌లో ప్రభాస్ ప్రస్తుతం ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు చేస్తున్నాడు.

    Also Read: Janhvi Kapoor: నయనతార తో పోల్చి నా పరువు తియ్యకండి – జాన్వీ కపూర్

    అయితే, ప్రభాస్ మంచి భోజన ప్రియుడు. ప్రభాస్ రుచులు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు భిన్న ర‌కాల వంట‌కాల‌ను ఇష్ట‌ప‌డ‌తాడు ప్రభాస్. ఇంతకీ ప్రభాస్ కి ఇష్టమైన పచ్చడి ఏమిటో తెలుసా ?, మాగాయ అంటే ప్రభాస్ కి ప్రాణం. మాగాయ పచ్చడిని ప్రభాస్ ఇష్టంగా తింటాడట. ముఖ్యంగా త‌న ఇంట్లో వాళ్ళ అమ్మ గారు పెట్టే మాగాయ అంటే ప్రభాస్ కి బాగా ఇష్టం అట.

    Prabhas

    అందుకే, షూటింగ్ స‌మ‌యాల్లోనూ సెట్‌లో ఉన్న‌వారికి ప్రభాస్ ప్ర‌త్యేకంగా ఈ ప‌చ్చ‌డిని తెప్పించి భోజ‌నం పెడుతూ ఉంటాడట. మరి నాన్ వెజ్ ఐటమ్స్ లో ప్రభాస్ కి ఏది ఎక్కువ బాగా ఇష్టం ?, ప్రభాస్ కి నాటుకోడి పులుసు అంటే చాలా బాగా ఇష్టం అట. ఆ పులుసులో గారెలు నచ్చుకుంటూ తినడం ప్రభాస్ కి మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అట. గతంలో ఈ విష‌యాన్ని ప్రభాసే స్వ‌యంగా ఓ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్ల‌డించాడు.

    ప్రభాస్ కి నాన్‌వెజ్ తో పాటు వాళ్ళ అమ్మగారు చేసే పప్పు అంటే కూడా బాగా ఇష్ట‌మ‌ట. అన్నట్టు ప్రభాస్ వంట కూడా చేస్తాడు. తన గెస్ట్ హౌస్ లో మాత్రమే అప్పుడప్పుడు బిర్యానీని ప్రభాస్ ప‌ర్ఫెక్ట్‌గా వండుతాడట. ఇక ప్రభాస్ భోజ‌న ప్రియులను బాగా ఇష్టపడతాడు అని.. వారి చేత వేర్వేరు వంట‌లు తినిపిస్తూ తాను బాగా ఎంజాయ్ చేస్తాడని ప్రభాస్ గురించి తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు.

    Also Read:Hero Surya: డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించబోతున్న హీరో సూర్య.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

    Tags