Project K: ప్రాజెక్ట్ కే టీమ్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రతిసారి నిరాశపరుస్తుంటే పచ్చి బూతులు తిడుతున్నారు. కాగా నేడు మధ్యాహ్నం 1:23 నిమిషాలకు ప్రాజెక్ట్ కే నుండి ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకటిన్నర కల్లా అప్డేట్ ఉంటుందని ఆ ఆశించిన ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది. గంటలు గడుస్తున్నా… ఫస్ట్ లుక్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చింది. ఎక్కడ ఫస్ట్ లుక్? అంటూ ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే బూతు కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ ఆగ్రహం చూసిన మేకర్స్ కొంచెం లేట్ అవుతుంది డార్లింగ్స్ అంటూ ట్వీట్ చేశారు. చావు కబురు చల్లగా చెప్పడంతో మరింత కోపం వ్యక్తం చేస్తున్నారు. దీపికా పదుకొనే లుక్ విషయంలో కూడా అదే చేశారు. దీపికా పదుకొనె ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీపికా పదుకొనె లుక్ లేటుగా వదిలారు. ఫస్ట్ గ్లింప్స్ మిస్ చేశారు. ప్రతిసారీ ఇలాగే జరుగుతుంటే ఫ్యాన్స్ సహనం కోల్పోతున్నారు.
కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్ కే టీమ్ అమెరికాలో ఉన్నారు. శాన్ డియాగో కామిక్ కామ్ జులై 20 నుండి మొదలు కానుంది. ఈ ఈవెంట్ కి ప్రాజెక్ట్ కే టీమ్ కి ఆహ్వానం దక్కింది. హీరో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, రానా, దీపికా పదుకొనె, దర్శకుడు నాగ్ అశ్విన్ అమెరికా వెళ్లారు. జులై 20న శాన్ డియాగో కామిక్ కాన్ వేదికగా ప్రాజెక్ట్ కే టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
భారత కాలమానం ప్రకారం జులై 21న ఈ అప్డేట్స్ మనకు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటాని సైతం కీలక రోల్స్ చేస్తున్నారు. కమల్ హాసన్ కూడా జాయిన్ కావడంతో హైప్ ఆకాశానికి చేరింది. ప్రాజెక్ట్ కే సైతం రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతుంది.
'K'oncham late avtundi darlings 😍 all good things take time. #ProjectK
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 19, 2023