https://oktelugu.com/

‘ఆది పురుష్’కి సప్రైజ్ ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ !

బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ – నేషనల్ స్టార్ ప్రభాస్ కలయికలో “ఏ- ఆది పురుష్” అనే భారీ సినిమాని ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అభిమానులు అఫీషియల్ పోస్టర్ వచ్చే వరకు ఆగలేక, వాళ్ళే సొంతగా శ్రీరాముడి గెటప్లో ఉన్న ప్రభాస్ పోస్టర్ ను డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఎంతగా అంటే.. చివరికి డైరెక్టర్ ఓం రౌత్ సైతం ఆ పోస్టర్ […]

Written By:
  • admin
  • , Updated On : November 9, 2020 / 03:59 PM IST
    Follow us on


    బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ – నేషనల్ స్టార్ ప్రభాస్ కలయికలో “ఏ- ఆది పురుష్” అనే భారీ సినిమాని ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అభిమానులు అఫీషియల్ పోస్టర్ వచ్చే వరకు ఆగలేక, వాళ్ళే సొంతగా శ్రీరాముడి గెటప్లో ఉన్న ప్రభాస్ పోస్టర్ ను డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఎంతగా అంటే.. చివరికి డైరెక్టర్ ఓం రౌత్ సైతం ఆ పోస్టర్ చూసి స్టన్నింగ్ అంటూ సప్రైజ్ ఫీలై డిజైన్ చేసినవారిని అభినందించేంతగా మొత్తానికి ఈ పోస్టర్ వైరల్ అయింది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కి ప్రభాస్ డిసెంబర్ లో డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    కాగా దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రభాస్ బాడీ పెంచనున్నాడని.. సినిమాలో ప్రభాస్ ఎనిమిది అడుగుల అజానబాహుడిగా కనిపించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే హైట్ ను మ్యానేజ్ చేసినా.. ఆ హైట్ కి తగ్గ బాడీని చాలా సహజంగా చూపించాలని ప్రభాస్ ప్రస్తుతం తన బాడీని పెంచే సన్నాహాల్లో ఉన్నాడు. రాధే శ్యామ్ షూటింగ్ చేస్తూనే గ్యాప్ వచ్చిన మధ్యలో ఈ సినిమా కోసం వర్కౌట్స్ చేస్తున్నాడు. ఇకపోతే ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

    Also Read: కాజల్ రోమాన్స్.. ఈసారి భర్తతో.. డంగవుతున్న ఫ్యాన్స్..!

    ఇక ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ లుక్ మాత్రమే బయటికిరాగా. ఇప్పుడు ఫ్యాన్స్ చేసిన ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంటుంది. నిజానికి రాముడిగా ప్రభాస్ లుక్ మీద ఒక పోస్టర్ రిలీజ్ చేయమని అభిమానులు చాలా రోజుల నుండి అడుగుతున్నా.. దర్శకనిర్మాతలు పట్టించుకోలేదు.. అప్పుడే లుక్ రివీల్ చేయకూడదనే ఉద్దేశ్యం కావొచ్చు వారిది. అది ఫ్యాన్స్ అక్కర్లేదు కదా.. అందుకే వారే ఒక పోస్టర్ క్రియేట్ చేసి జనం మీదకు వదిలారు. ఇక బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో ఇలాంటి భారీ సినిమాను చేయకుండా, సౌత్ హీరో అయిన ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే. విజువ‌ల్ గ్రాఫిక్స్ తో ఒక మ‌హ‌దాద్భుతంగా తెర‌కెక్కించి దేశంలోని అన్ని భాష‌లతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమాని భారీగా రిలీజ్ చేయనున్నారు.