టాలీవుడ్ దిగ్గజాలు అప్పట్లో భూములను ఎంతకు కొన్నారంటే?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ ఎప్పుడో మారిపోయింది. ఒకప్పుడు సినిమా నిర్మాణాలన్నీ మద్రాసుకే పరిమితమయ్యేవి. స్థానికంగా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంలో భాగంగా నాటి ప్రభుత్వాలు సినిమావాళ్లకు అతి తక్కువ ధరలో స్టూడియో నిర్మాణాలకు భూములను కేటాయించాయి. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ నాటి ప్రభుత్వాల ప్రోత్సహాకాలతో క్రమంగా హైదరాబాద్లో స్టూడియో నిర్మాణాలు జరగడంతో ప్రస్తుతం హైదరాబాద్ టాలీవుడ్ కు కేరాఫ్ గా మారింది. అయితే అప్పట్లో ప్రభుత్వం టాలీవుడ్ దిగ్గజాలకు […]

Written By: NARESH, Updated On : November 9, 2020 4:42 pm
Follow us on

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ ఎప్పుడో మారిపోయింది. ఒకప్పుడు సినిమా నిర్మాణాలన్నీ మద్రాసుకే పరిమితమయ్యేవి. స్థానికంగా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంలో భాగంగా నాటి ప్రభుత్వాలు సినిమావాళ్లకు అతి తక్కువ ధరలో స్టూడియో నిర్మాణాలకు భూములను కేటాయించాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

నాటి ప్రభుత్వాల ప్రోత్సహాకాలతో క్రమంగా హైదరాబాద్లో స్టూడియో నిర్మాణాలు జరగడంతో ప్రస్తుతం హైదరాబాద్ టాలీవుడ్ కు కేరాఫ్ గా మారింది. అయితే అప్పట్లో ప్రభుత్వం టాలీవుడ్ దిగ్గజాలకు ఎంత ధరకు భూములు కేటాయించిందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. తాజాగా దర్శకుడు శంకర్ కు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలో రూ.5లక్షలకు ఎకరా చొప్పున ఐదెకరాలు కేటాయించింది.

కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ.5లక్షలకే దర్శకుడు శంకర్ కు కేటాయించడంపై కరీంనగర్ కు చెందిన శంకర్ అనే వ్యక్తి కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఇది కోర్టులో విచారణ జరుగుతుండనే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా ఇంతకు ముందున్న ప్రభుత్వాలు స్టూడియోలు నిర్మిస్తామంటే ఎంత ధరకు సినిమావాళ్లకు భూములను కేటాయించిందనే వివరాలను కోర్టుకు సమర్పించింది.

Also Read: షూటింగ్ కు రెడీ అవుతున్న పుష్ప..!

ప్రభుత్వ సమర్పించి అఫిడవిట్ ప్రకారం 1975లో అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం కోసం అక్కినేని నాగేశ్వర్‌రావుకు రూ.5వేల చొప్పున 22 ఎకరాలు.. 1983లో పద్మాలయ స్టూడియో కోసం రూ.8,500 చొప్పున 9.5ఎకరాలు.. 1984లో రామానాయుడు స్టూడియో కోసం నామమాత్రపు ధరకు ఐదెకరాలు.. 1984లో దర్శకుడు రాఘవేంద్రరావు.. చక్రవర్తి.. కృష్ణమోహ‌న్‌‌కు రూ.8,500 ప్రకారం అర ఎకరం చొప్పున కేటాయించారు.

దర్శకుడు శంకర్ రూ.50 కోట్లతో ప్రపంచ స్థాయి స్టూడియో నిర్మిస్తానని.. తనకు రాయితీపై భూమి కేటాయించాలని 2016లోనే దరఖాస్తు చేసుకున్నాడు. తెలంగాణకు చెందిన స్థానిక ప్రతిభావంతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఆయనకు భూమి కేటాయించాలని‌ సిఫార్సు చేసిందని అఫిడవిట్లో ప్రభుత్వం పేర్కొంది.

Also Read: మంచు మనోజ్ పై ఎన్టీఆర్ కామెంట్స్.. అవాక్కవాల్సిందే..!

హైదరాబాద్ శివార్లలో ఎటువంటి అభివృద్ధి చేయని భూమినే ప్రభుత్వం ఆయన కేటాయించిందని.. అక్కడ మార్కెట్‌ విలువ ఎకరా రూ.20 లక్షలని పేర్కొంది. ఐదెకరాలగాను శంకర్‌ రూ.4.4కోట్లు డిపాజిట్‌ కూడా చేశారని పేర్కొంది. దీనిపై కోర్టు ఎలా తీర్పును ఇస్తుందో వేచిచూడాల్సిందే..!