Prabhas Donates For Tollywood Directors
Prabhas: ప్రభాస్ భోళా శంకరుడు. ఎంత సంపాదిస్తారో అదే స్థాయిలో దానధర్మాలు చేస్తాడు. కోవిడ్ సమయంలో ప్రభుత్వాలకు ప్రముఖులు ఆర్థిక సహాయం చేశారు. టాలీవుడ్ నుండి ప్రభాస్ అత్యధికంగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రభాస్ రూ. 3 కోట్ల ఆర్థిక సహాయం చేశాడు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. మొత్తంగా రూ. 4 కోట్ల రూపాయలు కోవిడ్ సంక్షోభంలో ప్రభాస్ దానం చేశాడు.
తాజాగా ప్రభాస్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. టాలీవుడ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కి ఆయన రూ. 35 లక్షలు డొనేట్ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు మారుతి స్వయంగా తెలియజేశారు. తెలుగు దిగ్దర్శకుల్లో ఒకరైన దాసరి నారాయణరావు జయంతి మే 4న డైరెక్టర్స్ డే నిర్వహిస్తున్నారు. ఆయన గౌరవార్థం తెలుగు చిత్ర పరిశ్రమ జన్మదినాన్ని డైరెక్టర్స్ డే గా ప్రకటించింది.
మే 4న డైరెక్టర్స్ డే వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ భారీ విరాళం అందించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతున్నారు. మా హీరో గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ తనతో పని చేసే నటులు, సెట్స్ లో పనిచేసే ప్రతి ఒక్కరి గురించి మంచిగా ఆలోచిస్తారని సమాచారం. ఆయన తినే భోజనం అందరూ తినేలా చర్యలు తీసుకుంటాడట.
ఇక తోటి హీరోయిన్స్ కి ప్రపంచంలోని అరుదైన వంటకాలతో ట్రీట్ ఇవ్వడం ఆయనకు అలవాటు. ఆయనతో పని చేసి పలువురు హీరోయిన్స్ ప్రభాస్ ఇచ్చిన ట్రీట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరోవైపు ప్రభాస్ చేతినిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న కల్కి 2829 AD పై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అలాగే రాజా సాబ్ టైటిల్ తో మారుతి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు.