https://oktelugu.com/

Prabhas – Badradri : ఆది పురుష్ విడుదల వేళ: భద్రాద్రి భక్తులపై ప్రభాస్ గొప్ప మనసు.. ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రాములవారి అన్నదాన సత్రానికి 10 లక్షల విరాళం ప్రకటించాడు. యూవీ క్రియేషన్స్ ప్రతినిధి ద్వారా భద్రాచలం రామాలయ ఈవో రమాదేవికి 10 లక్షల కు సంబంధించిన చెక్కును శనివారం అందజేశారు

Written By:
  • Rocky
  • , Updated On : May 13, 2023 / 09:55 PM IST
    Follow us on

    Prabhas Donetion To Badradri : ఆది పురుష్ త్వరలో విడుదల కాబోతోంది. రామాయణం ఇటివృత్తంగా రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కించుకుంది. ఇప్పటికీ యూట్యూబ్లో ట్రెండింగ్లో సాగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఇదంతా జరుగుతుండగానే రామ భక్తులకు ప్రభాస్ అండగా నిలిచారు. వారి అన్నదానానికి తన వంతు విరాళం ఇచ్చారు.

    భద్రాచలం రాములవారికి

    భద్రాచలం క్షేత్రం దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. ఈ క్షేత్రానికి ఎంతో ఐతిహ్యం ఉంది. రోజూ వేలాదిమంది భక్తులు రాములవారిని దర్శించుకుంటారు. కృష్ణంరాజు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా వెలుగొందుతున్న కాలంలో రాములవారిని సతీసమేతంగా దర్శించుకునేవారు ప్రభాస్ చిన్న వయసులో కూడా రాముల వారి దర్శనానికి తల్లిదండ్రులతో వచ్చేవారు. ప్రభాస్ ది రాజుల కుటుంబం కాబట్టి.. భద్రాచలం ఎప్పుడు వచ్చినా ఈ ప్రాంతంలో స్థిరపడిన రాజ కుటుంబీకులు వారికి ఘన స్వాగతం పలికేవారు.. అలా చిన్నప్పటినుంచి రాముడంటే ప్రభాస్ కు ప్రత్యేక భక్తి భావం ఏర్పడింది. ఆ భక్తి భావమే అతడితో ఆది పురుష్ సినిమా తీసేలా ప్రేరేపించింది.

    ఏదైనా ఒకటి చేయాలని..

    రాముడి జీవితం ఇతివృత్తంగా ఆది పురుష్ సినిమా రూపొందుతున్న వేళ.. రాముడిని కొలిచే భక్తుల కోసం ఏదైనా చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రాములవారి అన్నదాన సత్రానికి 10 లక్షల విరాళం ప్రకటించాడు. యూవీ క్రియేషన్స్ ప్రతినిధి ద్వారా భద్రాచలం రామాలయ ఈవో రమాదేవికి 10 లక్షల కు సంబంధించిన చెక్కును శనివారం అందజేశారు. అంతేకాదు రామాలయ అభివృద్ధికి తన వంతు తోడ్పాటు ఉంటుందని ప్రకటించారు. ఆది పురుష్ సినిమా షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ తో కలిసి అయోధ్యను దర్శించుకున్నారు.