https://oktelugu.com/

Mahesh Babu and Prabhas : మహేష్ బాబు చేయాల్సిన ఆ సూపర్ హిట్ సినిమాను ప్రభాస్ చేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వరుస సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే చాలామంది దర్శకులు చెప్పే కథలను వింటూ మంచి దొరికేంత వరకు కథలను వింటూనే ఉంటారు.

Written By: , Updated On : February 13, 2025 / 07:57 AM IST
Mahesh Babu , Prabhas

Mahesh Babu , Prabhas

Follow us on

Mahesh Babu and Prabhas : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వరుస సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే చాలామంది దర్శకులు చెప్పే కథలను వింటూ మంచి దొరికేంత వరకు కథలను వింటూనే ఉంటారు. మరి కొన్ని సందర్భాల్లో కథ విన్నప్పుడు అంత కిక్ ఇవ్వకపోయిన ఆ దర్శకుడు స్క్రీన్ మీద హీరోను ప్రజెంట్ చేసే విధానం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాని వల్ల కూడా సినిమాలు సక్సెస్ అవుతూ ఉంటాయి. వాటిని కూడా దర్శకుడు అంచనా వేసుకొని ముందుకు సాగితే మంచిది…

సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేస్తూ సక్సెస్ లను అందుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇక హీరోల క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక సినిమాని పర్ఫెక్ట్ గా జడ్జ్ చేయగలిగే నాలెడ్జ్ లేకపోతే మాత్రం సినిమా విషయంలో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరమైతే రావచ్చు. కొంతమంది హీరోలు సినిమా స్టొరీ బాలేదని రిజెక్ట్ చేస్తే ఆ సినిమాలు వేరే హీరోతో చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న దర్శకులు ఉన్నారు. ఇక సినిమా స్టోరీ బాగుంది అని హీరోలు తొందరపడి ఆ సినిమా చేసి చేతులు కాల్చుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా పర్ఫెక్ట్ గా సినిమా స్టోరీని జడ్జ్ చేసి దానిని పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేసే దర్శకుడిని ఎంచుకున్నప్పుడే సినిమా అనేది సక్సెస్ అవుతుంది… ఇక ఇదిలా ఉంటే ‘సూపర్ స్టార్ కృష్ణ’ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ‘మహేష్ బాబు’ (Mahesh Babu) కెరియర్ స్టార్టింగ్ లోనే తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని సూపర్ సక్సెస్ లను సాధించాడు. మహేష్ బాబు పూరి జగన్నాధ్ తో చేసిన ‘పోకిరి ‘ (Pokiri) సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే పోకిరి తర్వాత వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వం లో మరొక సినిమా చేయాల్సి ఉంది. మోత్తానికైతే వీళ్ళ కాంబినేషన్లో పోకిరి, బిజినెస్ మేన్ లాంటి రెండు సినిమాలు వచ్చాయి. అయితే పోకిరి సినిమా తర్వాత బుజ్జిగాడు సినిమా స్టోరీ ని కూడా పూరి మొదటి మహేష్ బాబుకు వినిపించారట.

కానీ మహేష్ బాబు ఆ సినిమా మీద పెద్దగా ఆసక్తి చూపించలేదనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత పూరి జగన్నాధ్ ఆ కథని ప్రభాస్ తో చేసి మంచి సక్సెస్ ని అందుకున్నాడు. నిజానికి ఈ సినిమా ద్వారానే ప్రభాస్ లో ఒక సపరేట్ యాంగిల్ ఉందని ఇలాంటి యాంగిల్ లో కూడా ప్రభాస్ తో మనం సినిమా చేయొచ్చా? అంటూ ప్రతి ఒక్క దర్శకుడు ఆలోచించే పొజిషన్ కి చేరుకున్నారు.

అంటే ఆ సినిమా ప్రభాస్ కెరియర్ ను ఎంతలా ఇంపాక్ట్ చేసి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ చెప్పే డైలాగులు గాని, చేసే యాక్షన్ ఎపిసోడ్స్ గాని ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉంటాయి. ఇప్పటికి చాలా మందికి ఈ సినిమా ఫేవరెట్ మూవీ గా ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…