Prabhas Director Controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు ఒక్కొ స్ట్రాటజీ ని ఫాలో అవుతూ వాళ్ళ కథలను సినిమాలుగా చేస్తూ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు… ‘అందాల రాక్షసి’ (Andala Rakshashi) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హను రాఘవపూడి (Hanu Raghavapudi) మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత నాని(Nani) తో చేసిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ (Krishna Gaadi Veera premagatha) అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. కమర్షియల్ గా కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించింది. ఆ తర్వాత నితిన్ తో చేసిన లై(Lie), శర్వానంద్ తో చేసిన పడి పడి లేచే మనసు (Padi Padi Leche MAnasu) రెండు ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో జానర్ మార్చి ఆర్మీ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకొని దుల్కర్ సల్మాన్ (Dulkar Salman) తో ‘సీతారామం’ (Seetha Ramam) అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక క్లాసికల్ హిట్ గా నిలిచింది.
ఆ మూవీ అందించిన సక్సెస్ తో ఇప్పుడు ఆయన ప్రభాస్ తో ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ సినిమాతో మరొక మెట్టు పైకి ఎక్కాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఆయన డైరెక్షన్ బావుంటుంది అని చాలామంది అతన్ని పొగుడుతూ ఉంటారు. నిజానికి ఆయన ఎంత పర్ఫెక్షనిస్తూ అంటే అందాల రాక్షసి (Andala Rakshashi) చేస్తున్న సమయంలో ఆ మూవీలో హీరో అయిన రాహుల్ రవీంద్రన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘అందాల రాక్షసి’ సినిమాలో తన ఫస్ట్ షాట్ ను తీస్తున్నప్పుడు గౌతమ్ (Rahul Ravindran) క్యారెక్టర్ని మిధున (లావణ్య త్రిపాఠి) పిలుస్తోంది.
అలాంటి సందర్భంలో గౌతమ్ ఒక్క సిగరెట్ తాగుతూ ఆ సిగరెట్ ని పక్కన పడేసి తన వైపు ఒక లుక్ ఇస్తాడు. ఆ లుక్ కోసం ఆ షాట్ ను దాదాపు 20 నుంచి 25 టేకులు తీసుకున్నట్టుగా ఆయన చెప్పాడు. నిజానికి హను రాఘవపూడి అన్ని టేకులు ఆయనతో ఎందుకు చేయించాడు అంటే గౌతమ్ అనే క్యారెక్టర్ లో విపరీతమైన షేడ్స్ ఉంటాయి. అవన్నీ పోయి తను గౌతమ్ అనే పాత్రలో స్టిక్ అయిపోవడానికి ఆయన అలాంటి స్ట్రాటజీని వాడినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…