Abhishek Bachchan Emotional Farewell: చాలా కాలం నుండి నేషనల్ మీడియా లో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), ఐశ్వర్య రాయ్(Aishwarya Rai Bachchan) మధ్య ఎక్కడో పెద్ద గ్యాప్ ఏర్పడిందని, ఈమధ్య కాలం లో వాళ్లిద్దరూ దూరంగా ఉంటున్నారని, విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. దీనిపై అటు అభిషేక్ బచ్చన్ కానీ, ఇటు ఐశ్వర్య రాయ్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ, అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫోటోలు అప్లోడ్ చేస్తూ మేము కలిసే ఉంటున్నాము అనే సంకేతాలు అభిమానులకు ఇచ్చారు. కానీ అభిమానులకు మాత్రం ఎక్కడో చిన్న అనుమానాలు ఇప్పటికీ ఈ జంట మీద ఉన్నాయి. ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తూ అభిషేక్ బచ్చన్ రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో వేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. ఈ పోస్ట్ ని చూసిన తర్వాత వీళ్లిద్దరు విడిపోలేదు కానీ, దూరం గా మాత్రం ఉంటున్నారు అని అర్థం చేసుకున్నారు నెటిజెన్స్.
అభిషేక్ మాట్లాడుతూ ‘మనుషులకు దూరంగా కొంతకాలం ఒంటరి జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి. నేను దేని కోసం జనమించాను అనేది అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు నేను ప్రేమించిన వారి కోసం ఇవ్వాల్సినవి మొత్తం ఇచ్చేశాను. ఇప్పుడు నాకోసం నేను సమయాన్ని కేటాయించుకోవాలని అనుకుంటున్నాను. ఇదే నాకు నిర్ణయం తీసుకోవడానికి సరైన సమయం’ అంటూ చెప్పుకొచ్చాడు. అభిషేక్ బచ్చన్ మాట్లాడిన మాటలు చూసి అభిమానులు కాస్త కంగారుకి గురయ్యారు. జనాలకు దూరంగా అంటే కుటుంబానికి కూడా దూరం గా వెళ్తున్నావని అర్థం అవుతుంది, సినిమాలు కూడా పూర్తిగా మానేయబోతున్నావా?, లేకపోతే నిన్ను నువ్వు తెలుసుకునే లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తావా? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ దూరం గా ఉంటున్నారు అనే రూమర్ లో వాస్తవం ఉంది అన్నమాట.
అభిషేక్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు?, కెరీర్ పరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న రేంజ్ సక్సెస్ రావడం లేదనే బాధతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా?, లేకపోతే తనకు బాగా ఇష్టమైన వాళ్ళు తనని అర్థం చేసుకోవడం లేదనే బాధలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా?, లేదా మరో కారణం ఏదైనా ఉందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గానే అభిషేక్ బచ్చన్ నటించిన ‘హౌస్ ఫుల్ 5’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. టాక్ డివైడ్ గానే వచ్చింది కానీ మొదటి పది రోజుల్లోనే 162 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ గా నిల్చింది. ఈ వీకెండ్ తో ఈ చిత్రం కచ్చితంగా 200 కోట్ల మార్కుని అందుకునే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత అభిషేక్ బచ్చన్ కి ఈ చిత్రం మంచి కమర్షియల్ హిట్ గా నిల్చింది.