Homeఎంటర్టైన్మెంట్Lavanya Tripathi On Hanu Raghavapudi : వరుణ్ తేజ్ వైఫ్ లావణ్యను తిట్టిన...

Lavanya Tripathi On Hanu Raghavapudi : వరుణ్ తేజ్ వైఫ్ లావణ్యను తిట్టిన ప్రభాస్ డైరెక్టర్… మేటర్ ఏంటంటే?

Lavanya Tripathi On Hanu Raghavapudi : మెగా హీరో వరుణ్ తేజ్-హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2013 నవంబర్ నెలలో ఇటలీ వేదికగా వీరి వివాహం జరిగింది. మిస్టర్ మూవీలో మొదటిసారి ఈ జంట కలిసి నటించారు. అనంతరం అంతరిక్షం చిత్రం చేశారు. ఈ క్రమంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. చాలా కాలం రహస్యంగా వీరి ప్రేమాయణం సాగింది. ఐదేళ్లుగా పైగా లావణ్య-వరుణ్ రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం. ఎట్టకేలకు లావణ్య వరుణ్ ని వివాహం చేసుకుని మెగా కోడలు హోదా పట్టేసింది. లావణ్య త్రిపాఠి తల్లి కూడా కాబోతున్నట్లు సమాచారం.

కాగా టాలీవుడ్ కి వచ్చిన కొత్తల్లో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని లావణ్య త్రిపాఠి షేర్ చేసుకుంది. దర్శకుడు హను రాఘవపూడి ఆమెను తిట్టాడట. లావణ్యను టాలీవుడ్ కి పరిచయం చేసింది హను రాఘవపూడినే. 2012లో విడుదలైన అందాల రాక్షసి చిత్రంతో లావణ్య తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అందాల రాక్షసి సెన్సిబుల్ ట్రై యాంగిల్ ట్రాజిక్ లవ్ స్టోరీగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించాడు. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్ హీరోలుగా నటించారు. కమర్షియల్ గా అడకున్నా అందాల రాక్షసి మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు.

Also Read : వరుణ్ తేజ్ షాకింగ్ మేకోవర్, గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మెగా హీరో!

హీరోయిన్ పాత్రకు లావణ్య త్రిపాఠి వంద శాతం న్యాయం చేసింది. మరో జెనీలియా పరిశ్రమకు దొరికిందని ప్రేక్షకులు భావించారు. ఆమె స్టార్ కావడం ఖాయమని అంచనా వేశారు. అందాల రాక్షసి దాదాపు 13 ఏళ్ల అనంతరం రీరిలీజ్ అవుతుంది. అందాల రాక్షసి జూన్ 13న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అందాల రాక్షసి షూటింగ్ సెట్స్ లో జరిగిన ఓ సంఘటనను లావణ్య గుర్తు చేసుకుంది. ఇద్దరు హీరోలతో పాటు హీరోయిన్ మేకప్ లేకుండా నటించాలి అనేది దర్శకుడి కండీషన్ అట.

ఫస్ట్ షెడ్యూల్ లో లావణ్య ముఖాన్ని జస్ట్ పౌడర్ రాసుకుని వచ్చిందట. అది చూసిన హను రాఘవపూడి ఆమెను తిట్టాడట. ఫోటో తీసి జూమ్ చేసి చూపిస్తూ.. నీ ముఖం మీద పౌడర్ స్పటికలు ఎలా కనిపిస్తున్నాయో చూడు అన్నాడట. వెంటనే ముఖం కడుక్కొని వచ్చి షూటింగ్ చేసిందట. లావణ్య త్రిపాఠి లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా హను రాఘవపూడి ప్రస్తుతం ప్రభాస్ తో పౌజీ చిత్రం చేస్తున్నారు. ఆయన గత చిత్రం సీతారామం భారీ విజయం అందుకుంది.

Exit mobile version