https://oktelugu.com/

Prabhas : ఫౌజీ లో ప్రభాస్ చనిపోతాడా..? క్లైమాక్స్ ట్విస్ట్ చెప్పేసిన డైరెక్టర్…

ఒక సినిమా ప్రేక్షకుడు చూస్తున్నాడు అంటే దాని వెనకాల చాలామంది రకరకాల కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. 24 క్రాఫ్ట్ లో ఉన్న ప్రతి వ్యక్తి తన డ్యూటీని సరిగ్గా నిర్వర్తించినప్పుడే ఒక సూపర్ హిట్ సినిమా అనేది బయటికి వస్తుంది. అందులో ఏ ఒక్కరు సరిగ్గా చేయలేకపోయిన కూడా ఒక నాసిరకం ప్రోడక్ట్ అయితే బయటికి వస్తుంది...తద్వారా సినిమా డిజాస్టర్ గా మిగులుతుందనే చెప్పాలి...

Written By: , Updated On : February 21, 2025 / 08:16 AM IST
Prabhas

Prabhas

Follow us on

Prabhas : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)…ఈయన చేస్తున్న సినిమాలతో పాన్ వరల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. (bahubali) సినిమాతో తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్న ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వైవిధ్య భరితమైన సినిమాలను చేస్తున్నాడు. ఇక ఎప్పుడైతే ప్రభాస్ పాన్ ఇండియాలో ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడో అప్పటినుంచి ఆయన కోసం అభిమానులు పడిచచ్చిపోతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ప్రభాస్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్ లో ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన స్టార్ డమ్ అనేది మరింతలా పెరిగే అవకాశమైతే ఉంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన ఇలాంటి పాత్రనైతే పోషించలేదు. కాబట్టి ఇది చాలా కొత్తగా ఉండడమే కాకుండా చూసే ప్రేక్షకుడిని సైతం అలరించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ప్రభాస్ ఈ సినిమా క్లైమాక్స్ లో చనిపోతాడు అంటూ ఒక ట్విస్ట్ అయితే రివిల్ అయినట్టుగా తెలుస్తోంది.

మరి ప్రభాస్ ఎందుకు చనిపోతాడు ఆయన చనిపోవడానికి గల కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇందులో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయా ఉండవా అనే అంశాలు కూడా తెరమీదకి రాబోతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.

ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. హను రాగవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో సీతారామం (setharamam) అనే ఒక సినిమా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఆ సినిమా క్లైమాక్స్ లో కూడా హీరో పాకిస్తాన్ వాళ్లకి దొరికిపోతాడు.

అలాగే ఫౌజీ సినిమాలో పాకిస్థాన్ వాళ్ళతో ఫైట్ చేసి మరి తన ప్రాణాలను వదిలేసే సీనైతే ఉందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. కాబట్టి స్పెషల్ అనౌన్స్ మెంట్ వస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుంది. ఎలాంటి సక్సెస్ సాధించబోతుంది అనేది తెలియాల్సి ఉంది…