Prabhas : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో అత్యధిక రెమ్యూనరేషన్స్ ని అందుకుంటున్న సూపర్ స్టార్స్ లో రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ముందు వరుసలో ఉంటాడు. ఒక్కో సినిమాకు ఆయన 100 నుండి 150 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు. ఆయన డేట్స్ ఇస్తే చాలు బ్లాంక్ చెక్ ఇవ్వడానికి ప్రతీ నిర్మాత సిద్ధంగా ఉంటాడు. అలాంటి సూపర్ స్టార్ కమర్సియల్ యాడ్స్ ప్రపంచంలోకి అడుగుపెడితే ఏ స్థాయిలో డబ్బులు సంపాదించగలడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం యాడ్స్ నుండే ఆయన ఏడాది కి వంద కోట్ల రూపాయిల డబ్బులను సంపాదించొచ్చు. కేవలం రెండు మూడు రోజుల కాల్ షీట్స్ ఇస్తే చాలు. తక్కువ శ్రమ ఎక్కువ డబ్బులు. అయినప్పటికీ ప్రభాస్ కమర్షియల్ యాడ్స్ చేయడానికి అసలు మొగ్గు చూపించడు. డబ్బులు ఇస్తామంటే బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేసే హీరోలు ఉన్న ఈ కాలంలో, ఎంత డబ్బులు ఇచ్చినా యాడ్స్ చేయను అనే ప్రభాస్ లాంటోళ్ళు కూడా ఉండడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం.
Also Read : ప్రభాస్ రాజాసాబ్ సినిమా లేటు అవ్వడానికి కారణం ఏంటి..?
ఇటీవలే ప్రభాస్ ని ఒక ప్రముఖ ప్రోడక్ట్ కి సంబంధించిన యాజమాన్యం కలిసి, మూడు రోజుల డేట్స్ ఇస్తే చాలు, పాతిక కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తామని ఆఫర్ చేశారట. అందుకు ప్రభాస్ పాతిక కోట్లు కాదు, వెయ్యి కోట్లు ఇచ్చినా కమర్షియల్ యాడ్స్ చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నాను అని సున్నితంగా చెప్పి వెనక్కి పంపేశాడట. మూడు రోజులకు పాతిక కోట్లు, అంటే ప్రతీ నెల 3 రోజుల కాల్ షీట్స్ ప్రభాస్ యాడ్స్ కి కేటాయిస్తే ఏడాదికి ప్రభాస్ 300 కోట్ల రూపాయిలు సంపాదించొచ్చు. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. కానీ ఆయన అలాంటివేమీ చేయడం లేదు. ఇలాంటి హీరోలు దేశం లో ఎంత మంది ఉంటారు చెప్పండి. గతం లో పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు.
అప్పట్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పెప్సీ కూల్ డ్రింక్ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే సౌత్ లో కమర్షియల్ యాడ్స్ ని సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం పవన్ కళ్యాణ్ నుండే మొదలైంది. అదే దారిలో వెళ్లుంటే నేడు పవన్ కళ్యాణ్ యాడ్స్ ప్రపంచం లో కింగ్ లాగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే పెప్సీ కూల్ డ్రింక్ లో విషం ఉంది అనే ప్రచారం జరిగిందో, అప్పటి నుండి పవన్ కళ్యాణ్ కమర్షియల్ యాడ్స్ చేయడమే పూర్తిగా మానేసాడు.ఇప్పుడు ప్రభాస్ కూడా అదే దారిలో పయనిస్తున్నాడు. ఇతర హీరోలు కూడా అదే దారిలో వెళ్ళమని చెప్పడం కరెక్ట్ కాదు కానీ, కనీసం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే విషయం లో దూరంగా ఉండండి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ పై పోలీసులు ఉక్కిపాదం మోపారు.
Also Read : ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్న దిల్ రాజు…కారణం ఏంటంటే..?