Prabhas and Ram Charan: ఎన్నిసార్లు విన్నా, చూసిన మళ్ళీ మళ్ళీ వినాలి, చూడాలి అనిపించే గాఢ మహాభారతం. ఇందులో ఒక్కొక్క క్యారక్టర్ లో ఉన్న ఎమోషన్స్ మనకి సరికొత్త జీవితపాఠాలు నేర్పిస్తాయి. ఈ కథతో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. కానీ ఆడియన్స్ మాత్రం రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించబోయే ‘మహాభారతం’ కోసం ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘వారణాసి’ చిత్రం చేస్తున్న రాజమౌళి, ఈ సినిమా తర్వాత బహుశా ఆయన ‘మహాభారతం’ సిరీస్ ని తెరకెక్కించే పనిలో ఉంటాడేమో అని అంటున్నారు. కేవలం ఒకే ఒక్క సినిమాతో చెప్పే కథ కాదిది. కనీసం 6 నుండి 8 సినిమాలు ఈ ఫ్రాంచైజ్ నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్ తీసి తానూ సినిమాల నుండి తప్పుకుంటానని రాజమౌళి ఇది వరకే చెప్పుకొచ్చాడు.
ఇది కాసేపు పక్కన పెడితే రాజమౌళి మహాభారతం సిరీస్ ని కొత్త వాళ్ళతో తీస్తాడా?, లేకపోతే స్టార్ హీరోలను పెట్టి తీస్తాడా అనే విషయం పై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ కచ్చితంగా స్టార్ హీరోలతో చేస్తాడని బలమైన నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. ఒకవేళ తీస్తే శ్రీ కృష్ణుడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు, అర్జునుడి పాత్రలో రామ్ చరణ్(Global Star Ram Charan), కర్ణుడి పాత్రలో ప్రభాస్(Rebel Star Prabhas) నటించే అవకాశాలు ఉన్నాయి. ఒక అభిమాని AI ని ఉపయోగించి కురుక్షేత్ర సంగ్రామం లో జరిగిన ఒక ఘటన ని తీసుకొని ఈ ముగ్గురి పై క్రియేట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇది ఏ యాంగిల్ లో కూడా AI వీడియో లాగా అనిపించడం లేదు. నిజమైన వీడియో లాగానే అనిపిస్తుంది. ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.
ఇక మిగిలిన క్యారెక్టర్స్ విషయానికి వస్తే భీముడి పాత్రలో ఎన్టీఆర్, నకులుడు పాత్రలో నాని, సహదేవుడు పాత్రలో విజయ్ దేవరకొండ ని తీసుకుంటే బాగుంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పాండవులకు అధిపతి అయినా ధర్మరాజు పాత్రలో పవన్ కళ్యాణ్, భీష్ముడి పాత్రలో రజినీకాంత్ , ద్రోణాచార్యుడి పాత్రలో అమితాబ్ బచ్చన్, దుర్యోధనుడి పాత్రలో రానా, ద్రౌపది పాత్రలో దీపికా పదుకొనే నటిస్తే అదిరిపోతోంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ రాజమౌళి మహాభారతం ని తెరకెక్కిస్తే ఇలాగే ఉంటుందేమో. ఆయన విజన్ లో ఉన్నటువంటి మహాభారతం వెండితెర పై చూసిన తర్వాత ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వుదని #RRR మూవీ ఇంటర్వ్యూ సమయం లోనే చెప్పుకొచ్చాడు రాజమౌళి. చూడాలి మరి ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుంది అనేది.
#Prabhas as #Karna#RamCharan as #Arjuna@ssrajamouli pls bring it on#AI #Mahabharat pic.twitter.com/ig3Ir6L7YJ
— Mr_Bhaddhakasthuduᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@Bhaddakasthudu) December 1, 2025