ప్రభాస్.. ఇప్పుడు నేషనల్ స్టార్. బాహుబలి తర్వాత ఆయన రేంజ్ ఆకాశంలో ఉంది. అందుకే.. ఇప్పుడు రెబల్ స్టార్ యాక్ట్ చేస్తున్న ప్రతీ సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతోంది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమా మన దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ.. నార్త్ లో మాత్రం మంచి కలెక్షన్లు కొల్లగొట్టడం విశేషం. ఈ మూవీ సుమారు రూ.150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ లెక్కలు చాలు మనోడి ప్రభావం అక్కడ ఏ రేంజ్ లో ఉందో. అందుకే.. బీటౌన్ దర్శక, నిర్మాతలు ప్రభాస్ తో సినిమా చేయడానికి పోటీ పడుతున్నారు.
Also Read: ప్రముఖ హీరోయిన్, దర్శకుడి ఇళ్లపై ఐటీ దాడులు
ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మరోవైపు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ‘సలార్’ తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’కూడా త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటాడోననే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది.
అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. ప్రభాస్ ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేయబోతున్నాడట. ఆదిపురుష్ రెగ్యులర్ షూట్లో పాల్గొనే సమయంలో చాలా రోజులపాటు ముంబైలో స్టే చేయాల్సి ఉంటుంది. దీంతో.. అక్కడా, ఇక్కడా ఎందుకని.. ఓ ఇల్లు కొనేస్తున్నాడట రెబల్ స్టార్. ఇప్పుడు ఉపయోగపడడంతోపాటు ఎప్పుడు ముంబై వచ్చినా.. ఇల్లు ఉంటుందని ఫిక్స్ అయ్యాడట. అంతేకాదు.. ముంబైలోనూ ఓ ప్రాపర్టీ ఉండిపోతుందనే ఆలోచన కూడా ఈ నిర్ణయానికి కారణమైందట.
Also Read: 18 ఏళ్లకు మొదటి ముద్దు.. సీనియర్ హీరోతో ప్రేమ !
అయితే.. ఇల్లంటే మామూలుగా కాదు.. భారీగా ఖర్చు పెట్టనున్నాడట ప్రభాస్. ఈ మేరకు ఆదిపురుష్ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ కు పురమాయించడాట. దీంతో.. ప్రభాస్ కు ఇల్లు వెతికిపెట్టే బాధ్యతను ఆయనే తీసుకున్నాడట. ముంబైలోని కాస్ట్లీ ఏరియాలో ఇల్లు చూడబోతున్నారని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ ఇంటికి పదుల కోట్లు ఖర్చు చేయబోతున్నారట. మరి, ఇల్లు ఏ ప్రాంతంలో తీసుకుంటాడు? ఎంత వెచ్చిస్తాడు? అన్నది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్