Prabhas Adipurush: ప్రభాస్ పేరు నేషనల్ వైడ్ గా ఒక సెన్సేషన్. బాహుబలితో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ప్రభాస్ మొదటిసారిగా శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే, ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా “ఏ- ఆది పురుష్” సినిమా రాబోతుంది. దీనికితోడు బాలీవుడ్ బడా దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ప్రభాస్ కి కృతిసనన్ జోడీగా నటిస్తోంది. ఇక ఈ ఆదిపురుష్ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ను యూవీ క్రియేషన్స్ రూ.100 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

నిజానికి సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో నష్టాలు వచ్చినప్పటికీ ఆ సంస్థ వెనకడుగు వేయకపోవడం గమనార్హం. పాన్ వరల్డ్ స్థాయిలో రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీని వచ్చే జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తానికి ఆదిపురుష్ ఒక్క తెలుగు థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.100 కోట్లను అందుకోవడం విశేషం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా రూ.500 కోట్ల బడ్జెట్‌తో రాబోతుంది. అందుకే, ఈ సినిమా కోసం బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు.
Also Read: Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడా? ఎప్పుడు? ఆ కథేంటి?
పైగా “ఆదిపురుష్” చిత్రం తన జీవితంలో చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అని ప్రభాస్ కూడా ఫీల్ అవుతున్నాడు. ఈ సినిమా గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. ‘ఆదిపురుష్ నాకు సినిమా కంటే ఎక్కువ. ఈ సినిమాకు బాక్సాపీస్ రికార్డులు ముఖ్యం కాదు. బడ్జెట్, ప్రజల అంగీకారం ముఖ్యమని ప్రభాస్ అన్నాడు. తన సినిమాతో ఎంత మంది నిరాశ చెందుతున్నారు, ఎందరు సంతోషంగా ఉంటున్నారో.. బాక్సాపీస్ ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతానని ప్రభాస్ చెప్పాడు. కాగా ఆదిపురుష్ చిత్రాన్ని ఒకే సమయంలో 15 దేశీయ, అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతుండగా.. సీతగా కృతి సనన్ రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత వున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. కాగా లేటెస్ట్ టెక్నాలజీతో తయారయ్యే సినిమాలో భారీ సెట్లు, భారీ క్రూ వగైరా వ్యవహారాలు లాంటివి లేకుండా మోషన్ కాప్చర్ విధానంలో నటీనటుల కదలికలు, హావభావాలు రికార్డుచేసి, వాటికి సాంకేతికత సాయంతో మిగిలిన హంగులను జోడిస్తారట. దీనివల్ల సినిమా చూడడానికి బాగా ఆసక్తికరంగా వుంటుందని, పైగా చాలా సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నారు మేకర్స్.
[…] […]
[…] […]