Jalsa Special shows Collections: చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని సెన్సషనల్ రికార్డ్స్ ని సృష్టించారు నేడు పవన్ కళ్యాణ్ ఫాన్స్..ఆయన పుట్టిన రోజుకి సందర్భంగా జల్సా సినిమాని ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ షోస్ నిర్వహించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ స్పెషల్ షోస్ కి ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇలాంటి క్రేజ్ ఇతర హీరోల సినిమాలకు మొదటి రోజు కూడా రాదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..మొదటి రోజు టికెట్స్ కోసం ఎలా అయితే అభిమానులు కొట్టుకుంటారో..జల్సా సినిమా టికెట్స్ కోసం అలా కొట్టుకున్నారు..జల్సా సినిమా కంటే ముందుగా మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాని ఆయన పుట్టిన రోజు నాడు స్పెషల్ షోస్ వేశారు..వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ప్రపంచవ్యాప్తంగా 375 షోస్ పాడగా ఒక కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..అంత గ్రాస్ స్పెషల్ శ్వస్ కి రావడం అదే తొలిసారి.

మహేష్ బాబు అభిమానులు అయితే సోషల్ మీడియా లో ఈ రికార్డు ని ఎవ్వరు కొట్టలేరు..జనాల్లో పోకిరి సినిమాకి మరియు పండుగాడు క్యారక్టర్ కి ఉన్న క్రేజ్ వేరు అంటూ పోస్టులు పెట్టేవారు..అయితే నెల తిరగక ముందే పోకిరి సినిమా గ్రాస్ ని జల్సా సినిమా డబుల్ మార్జిన్ తో లేపడం ఇండస్ట్రీ లో పెద్ద చర్చకు దారి తీసింది..ఒక్క నైజాం ప్రాంతం లోనే జల్సా సినిమాకి ఒక కోటి 25 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చింది..అంటే పోకిరి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో 70 శాతం కి పైగా నైజాం ప్రాంతం లోనే వసూలు చెయ్యడం ఒక రికార్డు గా చెప్పుకోవచ్చు.

మొత్తం మీద జల్సా సినిమా స్పెషల్ షోస్ ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఒక్క గుంటూరు ప్రాంతం ని మినహాయిస్తే జల్సా సినిమా ప్రతి చోట పోకిరి సినిమా రికార్డు ని డబుల్ మార్జిన్ తో కొట్టింది..ఉదాహరణకి హైదరాబాద్ సిటీ ని తీసుకుందాం..ఇక్కడ పోకిరి సినిమా 47 లక్షల రూపాయిలు గ్రాస్ ని వసూలు చేస్తే..జల్సా సినిమా కోటి రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఒక్క ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనే జల్సా సినిమా 35 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది అంటే మాములు విషయం కాదు..పోకిరి సినిమాకి సిటీ మొత్తం అన్ని థియేటర్స్ కలిపి 47 లక్షలు వసూలు చేస్తే, జల్సా సినిమాకి కేవలం ఒక్క మల్టిప్లెక్స్ నుండే ఆ స్థాయి వసూళ్లు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

