Rashmika Mandanna: పుష్ప’ శ్రీవల్లి రష్మిక మందన్నా ఈ ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకుంది. నేషనల్ క్రష్ గా మారింది. సౌత్ ఇండియన్ ఆడియన్స్ లో మాత్రమే కాదు.. ఉత్తర భారత అభిమానుల ప్రేమను సొంతం చేసుకుంటోంది. ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

తాజాగా రష్మిక నటించిన హిందీ సినిమా ‘గుడ్ బై’ ప్రమోషన్స్ లో రష్మిక ముంబైలో వాలింది. ముంబైలో ఆమెను చూడడం కోసం.. ఆమె దగ్గర ఆటోగ్రాఫ్ కోసం ఫ్యాన్స్ పోటీపడుతున్నారు.
Also Read: Ponniyin Selvan: ‘పొన్నియన్ సెల్వన్’: అసలు కథేంటి? ఎవరు ఏ పాత్రలు పోషించారంటే?
గుడ్ బై ప్రోగ్రామ్ కోసం వెళ్లిన రష్మికను ఓ అభిమాని ఆటోగ్రాఫ్ అడిగాడు. ‘ఎక్కడ సంతకం చేయాలి’ అని రష్మిక అడగ్గా.. తన గుండెలపై చేయమని ఛాతి చూపించాడు. మొదట రష్మిక ఈ హఠాత్ పరిణామానికి షాక్ అవ్వగా.. చివరకు అతడి గుండెలపై ఉన్న వైట్ టీ షర్ట్ పై సంతకం చేసింది.

ఈ మధ్యన రష్మిక ఉత్తర భారతంలో ఎక్కడికి వెళ్లినా యమ క్రేజ్ నెలకొంటోంది. ముంబైలో ఒక గుడికి వెళితే అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. రోడ్డుమీదకు రావడానికి చాలా సమయం పట్టింది. తన ఫ్లైట్ మిస్ అవుతుందని రష్మిక భయపడింది. పుష్ప తర్వాత రష్మికకు ముంబైలో ప్రేక్షకులు ఎంతగా అభిమానం చూపెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక గుండెలపై ఆటోగ్రాఫ్ చేయించుకున్న యువకుడి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read: Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ప్రేమికులకు భారీ షాక్… షో ఆపేయాలని డిసైడైన స్టార్ మా?
[…] Also Read: Rashmika Mandanna: రష్మిక ఆటోగ్రాఫ్ అతని గుండెలప… […]
[…] Also Read: Rashmika Mandanna: Rashmika’s autograph on his heart.. can’t stand it […]