టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ క్రేజే వేరు. సినిమా హిట్టయితే వచ్చే లాభాలు భారీ స్థాయిలో ఉంటాయి. పవన్ నటించే ఫ్లాప్ సినిమా సునాయాసంగా 50కోట్లు వసూలు చేస్తాయి. పవర్ స్టార్ ఛరిష్మాని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు ఆయన చుట్టూ తిరుగుతారు. అయితే, పవన్ నెల రోజులు డేట్స్ ఇస్తే.. 50కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. అంటే రోజుకు కోటి 60 లక్షల పైమాటే. ఈ పారితోషకంలో లాభాల్లో షేర్లు, డిస్ట్రిబ్యూషన్ హక్కులు లాంటివేమీ ఉండవు.
Also Read: క్రేజీ సినిమాకి ‘లైగర్’ సాలా క్రాస్ బ్రీడ్ !
మొత్తానికి పారితోషకం విషయంలో కూడ పవన్ కొత్త ట్రెండ్ సృష్టించాడు అన్నమాట. ఏది ఏమైనా జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ కి భారీ రెమ్యునరేషన్ ఇవ్వడం అంటే.. బహుశా ఒక్క పవన్ విషయంలోనే ఇది జరిగిందేమో. అయినా హిట్ కొడితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు. అందుకే నిర్మాతలు చాలామంది ఆయనతో సినిమా చేయడానికి సాహసిస్తుంటారు. మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నానని పవన్ చెప్పగానే నిర్మాతలు క్యూ కట్టేశారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
Also Read: పవన్ -చరణ్ లతో శంకర్ సినిమా.. ఇండస్ట్రీ షేకే !
కాగా ప్రతి సినిమాకూ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటికవరకు ఇండస్ట్రీలో ఆయన తీసుకుంటున్నదే హయ్యస్ట్ పారితోషకమనే టాక్ కూడా ఉందంటే, పవన్ కి ఉన్న డిమాండ్ ను అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని దాదాపు ముగించిన ఆయన త్వరలోనే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ప్రాజెక్టుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రం కోసం కేవలం 30 రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చిన పవన్.. ఈ సినిమాకి మాత్రం దాదాపు 52 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Power star shocking remuneration
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com