Megastar Chiranjeevi- Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవుతున్న సందర్భం గా ఈరోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ప్రెస్ మీట్ లో గాడ్ ఫాదర్ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ మోహన్ రాజా ఎంతో బలమైన కాంఫిడెన్స్ తో మాట్లాడిన మాటలు అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది..వాళ్ళ కళ్ళలో ఉన్న నమ్మకం చూస్తుంటే అప్పుడే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసారు అనే ఫీలింగ్ కనిపిస్తుంది..అభిమానులెవ్వరు ఊహించని మూడు సర్ప్రైజ్ ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని..కచ్చితంగా ఆ సన్నివేశాలు అభిమానులకు పూనకాలు రప్పించేలా చేస్తుందని డైరెక్టర్ చెప్పడం తో మూవీ పై అప్పటి వరుకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి..అంతే కాకుండా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గురించి ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది.

ఈ ప్రెస్ మీట్ లో విలేకరులు చిరంజీవి గారి రాజకీయ ప్రస్థానం గురించి కొన్ని ప్రశ్నలు వెయ్యగా..చిరంజీవి గారు దానికి సమాధానం చెప్తూ ‘చిన్నప్పటి నుండి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ నిజాయితీ, నిబ్బడతా గురించి నాకు బాగా తెలుసు..అలాంటి వాడు రాజకీయాల్లో ఉంటె మనస్ఫూర్తిగా సపోర్టు చెయ్యాలి..రాబొయ్యే కాలం లో అతను ఏ పక్షాన ఉంటాడో జనాలు నిర్ణయిస్తారు కానీ..నేను ఒక చోట..నా తమ్ముడు ఒక చోట ఉంటె బాగుండదు.

అందుకే నేను రాజకీయాల నుండి తప్పుకున్నాను..ఇది నా తమ్ముడికి కచ్చితంగా ఉపయోగపడుతుంది అనే ఆశిస్తున్నాను..రాబొయ్యే రోజుల్లో జనాలకు వాడికి అధికారం కూడా ఇస్తారేమో చూద్దాం..అలాంటి గొప్ప వాడు అధికారం లోకి రావాలి..రావాలనే నేను కోరుకుంటున్నాను’ అంటూ చిరంజీవి తొలిసారి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడడం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో అనందం ని కలగచేసాయి..ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన చిరంజీవి గారు కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన ఈ మాటలే ట్రేండింగ్ అవుతున్నాయి.
Also Read:Priyamani: పాపం ప్రియమణికి ఏమైంది.. మరీ సగమై పోయిందేంటి!
[…] […]
[…] […]
[…] […]