Power Star Birthday Surprises: పవన్ (Pawan Kalyan) పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఆ రోజు కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు పవన్ ఫ్యాన్స్ పెద్ద పనే పెట్టుకున్నారు. అందుకు ట్విట్టర్ ను వేదికగా మార్చుకోనున్నారు. ఇండియా వైడ్ గా పవన్ బర్త్ డే ట్యాగ్ ను వైరల్ చేయాలనేది పవన్ అభిమానుల టార్గెట్. పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఏమిటో ప్రపంచానికి మరోసారి ఘనంగా చాటి చెప్పడానికి ఫ్యాన్స్ గత వారం నుంచే సన్నాహాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్ గ్రూప్స్ తో పాటు అభిమాన సంఘాలను కూడా అలెర్ట్ చేశారు. ఆ రోజు అభిమానులు తమ వ్యక్తిగత పనులకు బ్రేక్ ఇచ్చి.. అందరూ పవన్ బర్త్ డే ట్యాగ్ ను వైరల్ చేయాలని తీర్మానం చేసుకున్నారు. మరి ఫ్యాన్స్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాలి. ఎన్టీఆర్, మహేష్ బర్త్ డేలు నాడు కూడా ఆయా హీరోల ఫ్యాన్స్ ఇదే విధంగా హడావుడి చేశారు.
అన్నట్టు పవన్ తన పుట్టిన రోజు ఏ సర్ ప్రైజ్ లను ప్లాన్ చేస్తున్నాడు ? ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి, ఆ నాలుగు సినిమాల నుండి 4 సర్ ప్రైజ్ లు వస్తాయా ? ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కలయికలో రానున్న సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుందని టాక్ నడుస్తోంది.
అయితే, ఈ సినిమా టీమ్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఆ మాటకొస్తే.. ఈ సినిమా చేస్తున్నట్లు ఇంతవరకు డేట్ కూడా ఫిక్స్ కాలేదు. ఇక ‘హరి హరి వీరమల్లు’ సినిమాకి సంబంధించి ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రానున్న భారీ సినిమా ఎనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉంది.
అదేవిధంగా “భీమ్లా నాయక్” చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారట. ఇప్పటికే తమన్ ఈ ఫస్ట్ సాంగ్ ను రెడీ చేశాడని, సాంగ్ అద్భుతంగా వచ్చింది అని తెలుస్తోంది.