‘‘సన్నాసి ముం#%&కొడకులు.. ఎదవలు.. లుచ్చా నా కొడుకులు.. కిరికిరి నా కొడుకులు.. దరిద్రులు, మల్లిగాడు బ్రోకర్, భట్టేబాజ్, నంజుకొని తినేస్తాం.. స్టువర్ట్ పురం దొంగ, గజ దొంగ, కుక్కలు, కొత్త బిచ్చగాళ్లు, బేవకూఫ్, కోతల పోషిగాడు.. ఆరేయ్,, కుక్క.. జోకుడుగాళ్లు, కాళ్లు చేతులు నరుకుతాం.. నాలుక కోస్తా.. సాలే.. గూట్లే’.. ఇవి తెలంగాణ నేతల నుంచి ఇటీవల జాలువారిన ఆణిముత్యాలు.. ఒకరిని మించి మరొకరు ఇచ్చుకున్న బిరుదాంకితాలు.. మరీ తెలంగాణలో గలీజు బూతు రాజకీయం నడుస్తోంది. నేతలంతా మరీ చిల్లరగా బూతు పదాలతో తిట్టిపోసుకుంటున్న తీరు నిజంగానే విస్తుగొలుపుతోంది.
తెలంగాణలో ప్రస్తుతం తిట్ల దండకాలు జోరుగా సాగుతున్నాయి. నేతలు ఒకరిపై మరొకరు ఒకరికంటే ఇంకొకరు ఎక్కువగా పరుష పదజాలాన్ని వాడుతున్నారు. సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తిట్ల పురాణాలు వల్లె వేస్తున్నారు. తిట్టుకోవడంలో కూడా ప్రత్యేకత పాటిస్తున్నారు. మూడుచింతల పల్లి వేదికగా రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు మంత్రి మల్లారెడ్డి రేవంత్ పై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. రాయడానికి కూడా వీలు లేని పదాలు వాడుతూ ఆయనలో కూడా గొప్ప తిట్లు ఉన్నాయని తెలిసేలా చేస్తున్నారు.
ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం హైదరాబాద్ లో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం సందర్భంగా వాడిన భాషతో ఆయనలో కూడా మంచి వక్త ఉన్నాడని అందరికి అర్థమైపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక దళితుడే సీఎం అవుతాడని చెప్పిన సీఎం మాట తప్పారని గుర్తు చేశారు. ఇప్పుడున్నది దళితుడేనా అని ప్రశ్నించారు. దీంతో నేతల మధ్య మాటల యుద్ధం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.
ఇక మంత్రి మల్లారెడ్డి అయితే తిట్లలో పీహెచ్ డీ చేశారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డిపై వాడిన పదజాలంతో ఆయన తీరు ఏంటో అర్థమైంది. భూకబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శలు చేసిన రేవంత్ రెడ్డిపై అసభ్య పదజాలంతో మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటలకు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాయడానికి కూడా వీలు లేని విధంగా మంత్రి విరుచుకుపడడం చూసి అంతా షాక్ అయ్యారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఆయనా హద్దులు దాటారు. ఇక ఈ తిట్ల రాజకీయానికి ఆద్యుడు కేసీఆర్ అని.. ఆయన అనుసరించిన దారిలోనే తాము నడుస్తున్నామని కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పడం కొసమెరుపు.. మొత్తానికి రాష్రంలో విమర్శలు మాని తిట్లతోనే సహవాసం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో రెచ్చి పోయి మరీ తిట్లు లంకించుకుంటున్నారు. ప్రజలు కూడా ఆలోచనలో పడిపోతున్నారు. నేతలు ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేసుకుంటారా అని మీమాంసలో ఉన్నారు. ఏదిఏమైనా రాష్ర్టంలో ప్రస్తుతం తిట్లతోనే నేతలు సమాధానాలు చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది.
తాజాగా సోషల్ మీడియాలో నేతల తిట్లదండకంపై బోలెడు ట్రోల్స్, మీమ్స్ పోటెత్తుతున్నాయి. మరీ ఇంత పచ్చి బూతులు తిట్టుకుంటారా? అని అందరూ షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఏపీ సహా ఏ రాష్ట్రంలోనూ ఇంతలా బరితెగించిన పాపాన నేతలు పోలేదు. ఇటీవల మహారాష్ట్రతో సీఎం ఉద్దవ్ ఠాక్రేను తిట్టిన కేంద్రమంత్రిని ఏకంగా అరెస్ట్ చేసిన పరిస్థితి. మరి తెలంగాణలోనూ అలాంటి పరిస్థితి వస్తుందా? నేతల మాటల మంటలకు ముగింపు ఎప్పుడు అన్నది వేచిచూడాల్సిందే..