Homeఎంటర్టైన్మెంట్Star Heroine Nagma: స్టార్ హీరోయిన్ నగ్మా ఎంతమంది హీరోలతో ప్రేమాయణం నడిపిందో తెలుసా..?

Star Heroine Nagma: స్టార్ హీరోయిన్ నగ్మా ఎంతమంది హీరోలతో ప్రేమాయణం నడిపిందో తెలుసా..?

Star Heroine Nagma: సౌత్ ఇండియా లో ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి నగ్మా..కేవలం తన అందం తో కుర్రకారుల మతిని పోగొట్టడమే కాదు..తన అద్భుతమైన నటన తో స్టార్ హీరోలను సైతం సవాలు చెయ్యగల నటి నిన్నటి తరం హీరోయిన్స్ లో నగ్మా గారు మాత్రమే..బాలీవుడ్ మూవీ తో వెండితెర ఆరంగేట్రం చేసినప్పటికీ కూడా ఆమెకి పెద్ద బ్రేక్ ఇచ్చింది మాత్రం మన టాలీవుడ్ అనే చెప్పాలి..కెరీర్ ప్రారంభం లోనే ‘ఘరానా మొగుడు’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో నటించే అవకాశం కొట్టేసిన నగ్మా..ఆ సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడం తో టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరూ నగ్మా ని తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాల్సిందిగా దర్శక నిర్మాతలను వత్తిడి చేసేవారు..అలా నగ్మా టాలీవుడ్ , కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ ని కూడా పదేళ్ల పాటు టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది..ఆ తర్వాత ఈమె వరుసగా భోజ్ పూరి సినిమాలలో నటించి 2008 వ సంవత్సరం లో రిటైర్ అయిపోయింది..ఈమె చెల్లెలు జ్యోతిక కూడా సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం నగ్మా గారు కాంగ్రెస్ పార్టీ లో ఒక నాయకురాలిగా కొనసాగుతున్నారు.

Star Heroine Nagma
Nagma

Also Read: Pawan Kalyan CBN: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్!

ఇది ఇలా ఉండగా 50 ఏళ్ళ వయసుకి దగ్గర పడుతున్న నగ్మా ఇప్పటికి పెళ్లి చేసుకోలేదు..దానికి కారణాలు చాలానే ఉన్నాయి..గతం లో ఈమె తమిళ టాప్ హీరో శరత్ కుమార్ తో ప్రేమాయణం నడిపింది..కానీ ఎందుకో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది..ఇక ఆ తర్వాత భోజ్ పూరి సూపర్ స్టార్ రవి కిషన్ తో చాలా సినిమాలే చేసింది..వీళ్లిద్దరి మధ్య కూడా అప్పట్లో లవ్ ట్రాక్ నడిచింది..కానీ చివరికి ఇది కూడా బ్రేకప్ అయ్యింది..ఇక ఆ తర్వాత మనోజ్ తివారి అనే హీరో తో ఈమె ప్రేమాయణం నడిపినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి..కానీ చివరికి ఇది కూడా బ్రేకప్ అయ్యింది..ఇక ఇండియన్ కెప్టెన్ గంగూలీ తో నగ్మా నడిపిన ప్రేమాయణం సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్ళ పెళ్లి పీటలు వరుకు వచ్చి పెటాకులు అయ్యింది..ఈ సంఘటన తో మనసు పూర్తిగా విరిగిపోయిన నగ్మా ఇక జీవితం లో ప్రేమ మరియు పెళ్ళికి స్థానం ఇవ్వకూడదు అని నిర్ణయించుకుందట..అందుకే ఆమె ఒంటరి జీవితం గడుపుతుంది..ఇక నగ్మా చెల్లి జ్యోతిక సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య ని పెళ్ళాడి సుఖవంతమైన జీవితం ని గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే.

Star Heroine Nagma
Nagma, Sourav Ganguly

Also Read: Anchor Sreemukhi: కురచ డ్రెస్ లో శ్రీముఖి హాట్ సిట్టింగ్ ఫోజ్… ఇది మరీ అరాచకంరా బాబోయ్!

హీరోయిన్ నగ్మా ప్రేమాయణం || Actress Nagma Unknown Love Stories || Oktelugu Entertainment

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version