https://oktelugu.com/

Jayam Ravi : సంక్రాంతి పండుగ రోజున పేరు మార్చుకున్న ప్రముఖ తమిళ హీరో జయం రవి..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!

ఆయన మాట్లాడుతూ 'ఈ రోజు నుండి నన్ను జయం రవి అని పిలవకండి. నా పేరు రవి మోహన్, ఇంట్లో నన్ను అందరూ అలాగే పిలుస్తారు. మీరు కూడా అలాగే పిలవండి. ఇన్ని రోజులు జయం రవి గానే వృత్తి పరంగా నా పేరు ప్రతిబింబించింది. కానీ ఇక నుండి నేను ఆ పేరు మీద కొనసాగదల్చుకోవడం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : January 14, 2025 / 06:00 AM IST

    Jayam Ravi

    Follow us on

    Jayam Ravi : కోలీవుడ్ లో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకడు జయం రవి. మన టాలీవుడ్ లో సూపర్ హిట్స్ గా నిల్చిన చిత్రాలను ఈయన ఎక్కువగా అక్కడ రీమేక్ చేసేవాడు. తెలుగులో నితిన్ ‘జయం’ చిత్రం ద్వారా పరిచయం అవ్వగా, అదే ‘జయం’ చిత్రాన్ని తమిళం లో రీమేక్ చేసి వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో అప్పటి నుండి ఆయన పేరు జయం రవి గా మారిపోయింది. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా తన పేరు ని మార్చుకుంటున్నాని, ఇక మీదట నన్ను జయం రవి అని పిలవొద్దు అంటూ తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఒక లేఖని విడుదల చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక నుండి తనని ‘రవి మోహన్’ అని పిలవాలంటూ అభిమానులను కోరాడు.

    ఆయన మాట్లాడుతూ ‘ఈ రోజు నుండి నన్ను జయం రవి అని పిలవకండి. నా పేరు రవి మోహన్, ఇంట్లో నన్ను అందరూ అలాగే పిలుస్తారు. మీరు కూడా అలాగే పిలవండి. ఇన్ని రోజులు జయం రవి గానే వృత్తి పరంగా నా పేరు ప్రతిబింబించింది. కానీ ఇక నుండి నేను ఆ పేరు మీద కొనసాగదల్చుకోవడం లేదు. అదే విధంగా ఈ నూతన పేరు మీద ఒక ఫౌండేషన్ ని స్థాపించి సేవాకార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అయితే అకస్మాత్తుగా ఇలా జయం రవి పేరు మార్చడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు. జయం రవి మొదటి నుండి జాతకాలను, న్యూమరాలజీ ని బలంగా నమ్ముతాడు. ఆ కారణం చేతనే జ్యోతిష్యుల సలహా మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

    ఈ అంశంపై సోషల్ మీడియా లో వినిపిస్తున్న మరో వాదన ఏమిటంటే గూగుల్ లో ఎవరైనా జయం రవి అనే పేరుతో వెతికితే, మొత్తం ఆయన విడాకులకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయని, ఇది ఆయన్ని తీవ్రమైన మానసిక వేదనకు గురి చేస్తుందని, అందుకే పేరుని మార్చుకున్నట్టు చర్చించుకుంటున్నారు. ఇక జయం రవి విషయానికి వస్తే ఈయన ఎడిటర్ మోహన్ కొడుకు. ఈయన అన్నయ్య మోహన్ రాజా కూడా దర్శకుడే. తమిళం లో టాప్ డైరెక్టర్ గా చలామణి అవుతున్న ఈయన, తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి తో ‘గాడ్ ఫాదర్’ వంటి చిత్రాన్ని తెరకెక్కించాడు. అదే విధంగా తమిళం లో ఈయన జయం రవి తో తీసిన ‘తన్ని ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ధ్రువ’ గా రీమేక్ చేసి పెద్ద హిట్ ని అందుకున్నాడు.