Producer C Kalyan: కొత్త సినిమాలను విడుదలైన రోజే HD ప్రింట్ తో ఐ బొమ్మ వెబ్ సైట్ లో అప్డేట్ సినీ ఇండస్ట్రీ కి వందల కోట్ల నష్టాలను తెచ్చిపెట్టిన ఇమ్మడి రవి(I Bomma Ravi) ని రీసెంట్ గానే పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా దీని గురించే ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు. నెటిజెన్స్ అయితే రవి కి మద్దతుగా నిలుస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో లేని టికెట్ రేట్స్ ని పెడుతూ, డబ్బులు దోచేయాలని చూస్తున్న నిర్మాతలకు రవి మాత్రమే కరెక్ట్ అని, అతని కారణంగా ఎలాంటి డబ్బు ఖర్చు చేయకుండా మేము సినిమాలను చూస్తున్నాం అంటూ ఆయనకు మద్దతుగా నిలుస్తుంటే, సినీ ఇండస్ట్రీ పెద్దలు మాత్రం రవి అరెస్ట్ ని ఒక పండుగ లాగ జరుపుకుంటున్నారు. అయితే ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ రవి గురించి రీసెంట్ గా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘ఇమ్మడి రవి లాంటోళ్ళు భూమికి భారం. ఇలాంటి వాళ్ళని అసలు బ్రతకనివ్వకూడదు, ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. ఇది నేను బాధతో, కడుపు మంటతో చెప్తున్న మాటలు. పోలీసుల వల్ల కాకపోతే, ఆ రవి ని మా సినిమా వాళ్లకు వదిలేయండి, మేము అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపేస్తాము. అలా చేస్తే మరోసారి పైరసీ చేయాలనే ఆలోచన రావాలన్నా ఇతరులు భయపడతారు. రవి ని పట్టుకోవడం పోలీసులు చేసిన కృషిని ఎప్పటికీ మరచిపోలేము. వాళ్లకు అభినందనలు తెలుపుతూ త్వరలోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరుపున సత్కరిస్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు కళ్యాణ్. ఒకవైపు సి కళ్యాణ్ ఇలా ఫైర్ మీద మాట్లాడితే, మరోవైపు సీనియర్ నటుడు, బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శివాజీ మాత్రం మరోలా మాట్లాడాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఇమ్మడి రవి లాంటి తెలివైన వాళ్ళు మన ప్రభుత్వాలకు కావాలి. డబ్బులు లేని సమయం లో పొట్టకూటి కోసం ఎదో తప్పు చేసాడు. కానీ ఇతని వద్ద ఉన్నటువంటి హ్యాకింగ్ స్కిల్స్ ని మంచి కోసం ఉపయోగించుకోవచ్చు’ అంటూ శివాజి చెప్పుకొచ్చాడు. ఒకవైపు ఇండస్ట్రీ మొత్తం ఇమ్మడి రవి ని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేస్తుంటే,మరోపక్క శివాజీ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో.