Actress Pragathi: టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అలరించిన వారిలో ఒకరు ప్రగతి(Actress Pragathi). ఈమె తమిళ సినిమా ఇండస్ట్రీ ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. మొదటి సినెమా,అలొనె హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ప్రగతి కి ఎందుకో హీరోయిన్ గా కాలం కలిసిరాలేదు. కానీ అక్కడితో ఆమె ఆగిపోకుండా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వందల తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సంపాదించుకుంది. టాలీవుడ్ లోకి ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బాబీ చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమైంది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ప్రగతి కి మంచి సూపర్ హిట్ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించే అవకాశం దక్కింది. అలా తెలుగు లో ఈమె దాదాపుగా 117 సినిమాల్లో నటించింది.
అదే విధంగా తమిళం లో దాదాపుగా 22 సినిమాల్లో నటించింది. వాటిల్లో మొదటి ఆరు సినిమాలు హీరోయిన్ గానే చేసింది. ఇక ఆ తర్వాత కన్నడ లో మూడు సినిమాలు, మలయాళం లో రెండు సినిమాలు చేసింది. మొత్తం మీద ఇప్పటి వరకు ఈమె 144 సినిమాల్లో నటించింది. ఇక బుల్లితెర పై అయితే దాదాపుగా 11 సీరియల్స్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి పేరుని సంపాదించింది. అవార్డ్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈమెకు ఏమైంది ఈ వేళ చిత్రానికి ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు దక్కగా, కల్యాణ వైభోగమే చిత్రానికి ఉత్తమ కమెడియన్ గా నంది అవార్డు ని సొంతం చేసుకుంది. సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే ప్రగతి పవర్ లిఫ్టింగ్ లో ఛాంపియన్. ఇప్పటి వరకు ఈమె లోకల్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎన్నో పోటీలలో పాల్గొని బోలెడన్ని మెడల్స్ ని సొంతం చేసుకుంది.
రీసెంట్ గా ఈమె ఇస్తాంబుల్ లో జరిగిన ఏషియన్ ఓపెన్ & మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో 84 కేజీల విభాగం లో 4 పథకాలను సాధించారు. బెంచ్ & స్క్వాడ్ లో రెండు సిల్వర్ మెడల్స్ ని సాధించిన ప్రగతి, డెడ్ లిఫ్ట్ లో ఒక గోల్డ్ మెడల్. ఓవరాల్ గా ఒక సిల్వర్ మెడల్ ని కైవసం చేసుకున్నట్టు ప్రగతి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె అప్లోడ్ చేసిన వీడియో లు, ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ప్రగతి సాధిస్తున్న ఈ విజయాలను ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తే ఒలంపిక్స్ పోటీల వరకు వెళ్లగలరని అంటున్నారు నెటిజెన్స్.