Shukri Conrad: క్రికెట్ అన్నాక ఎవరో ఒకరు గెలుస్తారు. ఎవరో ఒకరు ఓడి పోతారు. కొన్ని సందర్భాలలో ఒక జట్టు వరుసగా ఓటములు ఎదుర్కోవచ్చు. మరో జట్టు విజయాలు సాధించవచ్చు. విజయాలు సాధించిన జట్టు విర్రవీగాల్సిన అవసరం లేదు. ఓడిపోయిన జట్టు కుంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే గెలుపు అనేది ఒకరికి శాశ్వత చిరునామా కాదు. ఓటమి అనేది మరొకరికి పర్మినెంట్ అడ్రస్ కాదు.
పై ఉపోద్ఘాతం గురించి క్రికెట్ ఆడే వాళ్ళందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా కోచ్ షుక్రీ విస్మరించాడు. ఇటీవల టీమిండియా దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోవడం తో అతడు ఏకంగా గ్రోవెల్(సాష్టాంగ పడటం) అని టీమ్ ఇండియా ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా రెండవ టెస్టు జరుగుతున్నప్పుడు టీమిండియా కు ఫాలో ఆన్ ఇవ్వకుండానే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేసింది.. ఈ నేపథ్యంలో షుక్రీ విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్లేయర్లను ఎక్కువసేపు మైదానంలో ఉండడానికి ప్రయత్నించామని చెప్పాడు. టీమిండియా ప్లేయర్లు మ్యాచ్ విజయం కోసం మోకాళ్ళ మీద నిలిచి ఉండేలా చేయడానికి ఇన్నింగ్స్ త్వరగా డిక్లేర్ చేయలేదని వ్యాఖ్యానించారు.
అప్పుడు అతడు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. సునీల్ గవాస్కర్ అయితే షుక్రి వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండేది? భారత్ ఎలా సహాయం చేసింది? అనే విషయాలను గుర్తుంచుకోవాలని గవాస్కర్ హితవు పలికాడు. కెప్టెన్ బవుమా కూడా కోచ్ వ్యాఖ్యలకు వంత పాడటం విశేషం.
తొలి వన్డేలో గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా కోచ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో అప్పటికే అందరికీ పరిస్థితి అర్థం అయిపోయింది. ఈ నేపథ్యంలో రెండవ వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచింది. నిర్మాతకమైన మూడవ వన్డేలో మాత్రం టీమిండియా ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపును దక్కించుకుంది. ఫలితంగా దక్షిణాఫ్రికా కోచ్ కు టీమిండియా ప్లేయర్లు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారని.. షుక్రి కి చికిరీ అదిరిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.
వాస్తవానికి కోచ్ స్థానంలో ఉన్న వ్యక్తి వివాదాస్పద చేయకూడదు. కానీ దక్షిణాఫ్రికా కోచ్ తను కీలక స్థానంలో ఉండి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేశాడు. క్రీడా స్ఫూర్తికి భంగం కలిగించే విధంగా మాట్లాడాడు. కోచ్ అనే వ్యక్తి న్యూట్రల్ గా ఉండాల్సి ఉండగా.. తను ఆ విషయాన్ని మర్చిపోయాడు.. చివరికి బి గ్రేడ్ స్థాయి వ్యాఖ్యలు చేయడంతో టీమ్ ఇండియా అభిమానులు దక్షిణాఫ్రికా కోచ్ కు సోషల్ మీడియాలో చుక్కలు చూపిస్తున్నారు.