Namita Baby Shower: తెలుగు సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన హీరోయిన్ నమిత. చేసింది నాలుగైదు సినిమాలే అయినా గ్లామర్ పాత్రలతో అదరగొట్టింది. సింహా సినిమాలో ఆమె నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అంటూ ఆమె చేసిన డ్యాన్సుకు ప్రేక్షకులు జేజేలు పలికారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమా ద్వారా అరంగేట్రం చేసినా ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, ఐతే ఏంటి, బిల్లా చిత్రాల ద్వారా తన టాలెంట్ చూపించింది. తెలుగులో ఓ వెలుగు వెలిగింది. కానీ తరువాత కోలీవుడ్ కు వెళ్లింది అక్కడ కూడా అవకాశాలు తగ్గడంతో ఇక తెరమరుగైంది.

ఆ మధ్యనే కోలీవుడ్ నటుడు వీరేంద్ర చౌదరిని 2017లో పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపింది. ఇటీవల ఓ శుభవార్త చెప్పింది. తాము ఇద్దరం ముగ్గురం కాబోతున్నామని ప్రకటించింది. అంతేకాకుండా తన కడుపులో ఉన్న బేబి కదలికలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతోంది. 41 ఏళ్లకు ఆమె తల్లి కావడం అందరిని ఆశ్చర్యపరచింది. కానీ మొత్తానికి తనకు మాతృత్వపు మమకారం రుచిచూపించే అవకాశం వచ్చినందుకు సంతోషపడుతోంది.
Also Read: Samantha: హాట్ హాట్ సమంత… అసలు తగ్గడం లేదుగా!

తల్లి కాబోతున్న మధురానుభూతితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మాతృత్వం అనేది ప్రతి ఆడదాని కల. అందుకోసమే సర్వస్వం త్యాగం చేస్తుంది. మొత్తానికి నమిత తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఆమెకు సీమంతం చేశారు. సంప్రదాయ పద్ధతిలో జరిగిన సీమంతాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. దీంతో అది వైరల్ అవుతోంది. ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ఇన్నాళ్లకు తల్లి కాబోతున్నందుకు సంతోషంగా ఉందని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. సీమంతం చేయడంతో నమిత తనకు పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటోంది. తనకు అమ్మ అని పిలిచే ఓ అతిథి రానుందని సంబరపడిపోతోంది.
https://www.youtube.com/watch?v=KdWDeJTQGso
Also Read:Megastar Chiranjeevi: చిరంజీవి ఆ హీరో ఫ్యాన్స్ అధ్యక్షుడు…. మహేష్ అభిమానులు సంబరాలు చేసుకునే న్యూస్
Recommended Videos
[…] Also Read: Namita Baby Shower: నమితకు సీమంతం.. వైరల్ అవుతున్న… […]